సౌతాఫ్రికాకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ 2019లో భాగంగా బర్మింగ్ హోమ్ వేదికగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా ఎరుగని న్యూజిలాండ్‌లో సౌతాఫ్రికా ఇవాళ తలపడబోతోంది. అయితే ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా ఒక మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే.. టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలవనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిచినా.. […]

సౌతాఫ్రికాకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

Edited By:

Updated on: Jun 19, 2019 | 12:32 PM

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ 2019లో భాగంగా బర్మింగ్ హోమ్ వేదికగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా ఎరుగని న్యూజిలాండ్‌లో సౌతాఫ్రికా ఇవాళ తలపడబోతోంది. అయితే ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా ఒక మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే.. టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలవనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిచినా.. మరో నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధిస్తేనే దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.