ICC T20 World Cup 2021: ఐసీసీ ఈవెంట్లలో ధోనీ-శాస్త్రి-విరాట్ త్రయం విఫలం.. 8 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగానే ఐసీసీ టైటిల్..!

|

Sep 13, 2021 | 9:08 AM

Dhoni-Shastri-Virat: యూఏఈ, ఒమన్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, రవిశాస్త్రి కోచ్‌గా, మహేంద్ర సింగ్ ధోనీ మెంటర్ పాత్రలో కనిపించనున్నారు.

ICC T20 World Cup 2021: ఐసీసీ ఈవెంట్లలో ధోనీ-శాస్త్రి-విరాట్ త్రయం విఫలం.. 8 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగానే ఐసీసీ టైటిల్..!
Dhoni Shastri Virat
Follow us on

Dhoni-Shastri-Virat: యూఏఈ, ఒమన్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, రవిశాస్త్రి కోచ్‌గా, మహేంద్ర సింగ్ ధోనీ మెంటర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌లో విరాట్, ధోనీ, శాస్త్రి ముగ్గురు కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ ముగ్గురు కలిసి 2015, 2019 లో వన్డే ప్రపంచ కప్‌, 2016 లో టీ 20 ప్రపంచ కప్‌లో కూడా జట్టు నిర్వహణలో పాల్గొన్నారు. కానీ, ఈ అన్ని టోర్నమెంట్లలో భారత జట్టు ఛాంపియన్‌గా మారలేకపోయింది.

2015 లో..
మొదటిసారిగా, 2015 లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి త్రయం మొదటిసారి కలిసి పనిచేసింది. ఆ సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. విరాట్ కోహ్లీ జట్టులో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మెన్. రవిశాస్త్రి జట్టు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ టోర్నీలో భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 95 పరుగుల పరాజయాన్ని చవిచూసింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకుంది.

2016లో..
2016 టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. 2016 టీ 20 ప్రపంచకప్‌లో ధోనీ, విరాట్, శాస్త్రి ముగ్గురు కలిసి టీంతో ఉన్నారు. అప్పుడు ధోనీ కెప్టెన్, విరాట్ వైస్ కెప్టెన్, శాస్త్రి టీమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ టోర్నమెంట్ భారతదేశంలోనే జరిగింది. భారత జట్టు ఈసారి కూడా సెమీ ఫైనల్స్ దాటి ముందుకు సాగలేకపోయింది. ముంబైలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ని ఓడించి వెస్టిండీస్ టైటిల్ గెలుచుకుంది.

2019లో..
2019 లో న్యూజిలాండ్ టీం టీమిండియా పై విజయం సాధించి, టోర్నీలో ముందుకు సాగకుండా అడ్డుపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్‌లో ధోనీ, శాస్త్రి, విరాట్ చివరిగా కలిసి పనిచేశారు. ఈసారి విరాట్ కోహ్లీ కెప్టెన్, ధోనీ సీనియర్ బ్యాట్స్‌మన్/వికెట్ కీపర్, శాస్త్రి కోచ్‌గా టీంతో ఉన్నారు. లీగ్ మ్యాచ్‌లలో భారతదేశం బాగానే ఆడింది. మొత్తం 9 మ్యాచ్‌లలో 7 గెలిచి మొదటి స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ, మరోసారి ఈ త్రయం జట్టు ఫైనల్ చేరుకోలేకపోయింది. న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ధోనీ కెప్టెన్సీలో 6 వరల్డ్ కప్‌లు మిస్..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇదే ప్రేరణతో 2021 టీ 20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాకు బాగా హెల్ప్ కానుంది. కానీ, ధోనీ కెప్టెన్సీలో భారత్ 6 ప్రపంచకప్‌లను కూడా కోల్పోయిందని మర్చిపోకూడదు. వీటిలో ఐదు టీ 20 ప్రపంచ కప్‌లు (2009, 2010, 2012, 2014, 2016), ఒక వన్డే ప్రపంచ కప్ (2015) ఉన్నాయి. కాబట్టి ధోనీ మెంటార్‌గా ఉండటం విజయానికి హామీ కాదు. ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ రౌండ్లలో టీమ్ ఇండియా తన పనితీరును మెరుగుపరుచుకుంటేనే విజయం సాధింస్తుంది.

8 ఏళ్లుగా భారత్‌కు అందని ఐసీసీ టైటిల్
గత 8 సంవత్సరాలుగా భారత భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవలేదు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తన చివరి విజయం సాధించింది. అప్పుడు ఫైనల్లో ఇంగ్లండ్‌ని ఓడించింది. దీని తరువాత, భారత జట్టు 2015, 2019 వన్డే ప్రపంచ కప్‌లు, 2016 టీ 20 ప్రపంచ కప్‌ల సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. అలాగే, 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది.

Also Read: Neeraj Chopra: మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు.. వ్యంగ్యంగా మాట్లాడారు.. కేబీసీ 13లో ఒలింపిక్ పతక విజేతల భావోద్వేగం.. ఈ షో ఎప్పుడంటే?

IPL 2021: శుభవార్త చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. భార్యతో కలిసి సీఎస్‌కే జెర్సీలో సందడి..!

US Open 2021: నోవాక్‌ జకోవిచ్‌కు మరోసారి షాకిచ్చిన రష్యా ఆటగాడు.. యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన మెద్వెదెవ్‌