ICC World Cup 2027: ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?

ICC World Cup 2027: ఐసీసీ 2027 వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్‌‌ను నేడు కేప్ టౌన్‌లో విడుదల చేసింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది ముందు ఈ ప్రకటన వెలువడింది. భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూసే భారత్ పాక్ మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది.

ICC World Cup 2027:  ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
Icc World Cup 2027

Updated on: Oct 01, 2026 | 9:46 PM

ICC World Cup 2027: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కేప్ టౌన్ వేదికగా అత్యంత వైభవంగా ఆవిష్కరించింది. ఈ ప్రధాన ఘట్టంతో ఈ మెగా టోర్నీకి సరిగ్గా ఒక ఏడాది కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలోనే అధికారికంగా మ్యాచ్‌ల తేదీలతో పాటు టికెట్ల కేటాయింపు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఈసారి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, 12 వేదికలపై 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టోర్నమెంట్ ఫార్మాట్‌లోనూ ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్ దశ తర్వాత కొత్తగా సూపర్ 7 స్టేజ్‌ను పరిచయం చేశారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.

ICC 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన గ్రూపులను ICC ప్రకటించింది.

గ్రూప్ A:

ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ A

గ్రూప్ B:

బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, క్వాలిఫయర్ B

 

 

మారిన టోర్నమెంట్ స్వరూపం

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ 2027లో ప్రధానంగా జట్ల సంఖ్యతో పాటు టోర్నీ నిర్వహణ విధానమే పూర్తిగా మారింది. గత 2023 ప్రపంచకప్‌లో 10 జట్లు ఒకే లీగ్‌ విధానంలో ఒక్కో జట్టుతో ఆడగా, 2027లో 14 జట్లను తీసుకొచ్చి మూడు దశల కొత్త ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. మొదట ర్యాంకింగ్స్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు సూపర్ సిరీస్‌లో రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో తలపడతాయి. అందులో విజేత ప్రధాన గ్రూప్‌ దశలోకి వెళ్తుంది. ఆ తర్వాత మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపులో ఆరు జట్లతో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్‌లోని అగ్ర మూడు జట్లతో పాటు రెండు గ్రూపుల్లో తదుపరి అత్యుత్తమ రికార్డు ఉన్న మరో జట్టు కలిపి ఏడు జట్లు సూపర్‌ 7 దశకు చేరతాయి.

అసలు కీలకమైన మార్పు సూపర్‌ 7 దశలోనే ఉంటుంది. ఏడు జట్లు మరోసారి రౌండ్‌ రాబిన్‌ విధానంలో తలపడతాయి. ఇక్కడ మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్తాయి. తొలి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో, రెండో స్థానంలోని జట్టు మూడో స్థానంలోని జట్టుతో సెమీఫైనల్స్‌ ఆడతాయి. ఈ విధంగా 2027 ప్రపంచకప్‌ సూపర్‌ సిరీస్‌ నుంచి గ్రూప్‌ దశ నుంచి సూపర్‌ 7 నుంచి సెమీఫైనల్స్‌ నుంచి ఫైనల్‌గా సాగుతుంది. మొత్తంగా 14 జట్లు, 57 మ్యాచ్‌లతో టోర్నీ జరగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తుండగా, టోర్నీ అక్టోబర్‌ 2న ప్రారంభమై నవంబర్‌ 21న ఫైనల్‌తో ముగియనుంది.

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2027 షెడ్యూల్

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2027కు సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తేదీ, జట్లు, వేదికల వారీగా ఇలా చూడొచ్చు.

లీగ్ దశ మ్యాచ్‌లు

2 అక్టోబర్, శనివారం: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్

4 అక్టోబర్, సోమవారం: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2 — విండ్‌హోక్

6 అక్టోబర్, బుధవారం: క్వాలిఫయర్ 2 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్

 7 అక్టోబర్, గురువారం: భారత్ vs ఆస్ట్రేలియా — కేప్‌టౌన్

8 అక్టోబర్, శుక్రవారం: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్థాన్ — ష్వానే

8 అక్టోబర్, శుక్రవారం: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ — విండ్‌హోక్

9 అక్టోబర్, శనివారం: జింబాబ్వే vs క్వాలిఫయర్ ఏ — బులవాయో

9 అక్టోబర్, శనివారం: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ — కేప్‌టౌన్

 10 అక్టోబర్, ఆదివారం: భారత్ vs పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్

10 అక్టోబర్, ఆదివారం: శ్రీలంక vs క్వాలిఫయర్ బీ — విండ్‌హోక్

11 అక్టోబర్, సోమవారం: జింబాబ్వే vs ఆఫ్ఘనిస్థాన్ — బులవాయో

12 అక్టోబర్, మంగళవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ ఏ — పార్ల్

12 అక్టోబర్, మంగళవారం: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ — కుగోంపో సిటీ

13 అక్టోబర్, బుధవారం: ఇంగ్లాండ్ vs శ్రీలంక — విండ్‌హోక్

13 అక్టోబర్, బుధవారం: దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ బీ — పార్ల్

 14 అక్టోబర్, గురువారం: భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ — ష్వానే

15 అక్టోబర్, శుక్రవారం: పాకిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్

15 అక్టోబర్, శుక్రవారం: జింబాబ్వే vs ఆస్ట్రేలియా — హరారే

16 అక్టోబర్, శనివారం: శ్రీలంక vs బంగ్లాదేశ్ — డర్బన్

16 అక్టోబర్, శనివారం: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ — గ్కెబెర్హా

 17 అక్టోబర్, ఆదివారం: భారత్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్

17 అక్టోబర్, ఆదివారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ బీ — హరారే

18 అక్టోబర్, సోమవారం: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్థాన్ — కుగోంపో సిటీ

19 అక్టోబర్, మంగళవారం: జింబాబ్వే vs పాకిస్థాన్ — హరారే

19 అక్టోబర్, మంగళవారం: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ — డర్బన్

20 అక్టోబర్, బుధవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్

20 అక్టోబర్, బుధవారం: ఇంగ్లాండ్ vs క్వాలిఫయర్ బీ — హరారే

21 అక్టోబర్, గురువారం: ఆఫ్ఘనిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — కుగోంపో సిటీ

22 అక్టోబర్, శుక్రవారం: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ — పార్ల్

22 అక్టోబర్, శుక్రవారం: దక్షిణాఫ్రికా vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్

23 అక్టోబర్, శనివారం: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ — గ్కెబెర్హా

23 అక్టోబర్, శనివారం: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ బీ — ష్వానే

 24 అక్టోబర్, ఆదివారం: జింబాబ్వే vs భారత్ — విక్టోరియా ఫాల్స్

 

సూపర్ దశ మ్యాచ్‌లు

25 అక్టోబర్, సోమవారం: ఏ2 vs బీ3 — జోహన్నెస్‌బర్గ్

26 అక్టోబర్, మంగళవారం: బీ1 vs ఏ3 — గ్కెబెర్హా

27 అక్టోబర్, బుధవారం: బీ2 vs ఏబీ4 — ష్వానే

28 అక్టోబర్, గురువారం: ఏ1 vs ఏ2 — విక్టోరియా ఫాల్స్

29 అక్టోబర్, శుక్రవారం: బీ1 vs బీ3 — కుగోంపో సిటీ

30 అక్టోబర్, శనివారం: ఏ3 vs ఏబీ4 — విక్టోరియా ఫాల్స్

31 అక్టోబర్, ఆదివారం: బీ2 vs ఏ1 — జోహన్నెస్‌బర్గ్

1 నవంబర్, సోమవారం: ఏ2 vs బీ1 — విక్టోరియా ఫాల్స్

2 నవంబర్, మంగళవారం: బీ3 vs ఏబీ4 — కేప్‌టౌన్

3 నవంబర్, బుధవారం: బీ2 vs ఏ3 — డర్బన్

4 నవంబర్, గురువారం: ఏ1 vs బీ1 — పార్ల్

5 నవంబర్, శుక్రవారం: ఏ2 vs ఏబీ4 — డర్బన్

6 నవంబర్, శనివారం: బీ2 vs బీ3 — బ్లోమ్‌ఫొంటెయిన్

7 నవంబర్, ఆదివారం: ఏ1 vs ఏ3 — కేప్‌టౌన్

8 నవంబర్, సోమవారం: బీ1 vs ఏబీ4 — డర్బన్

9 నవంబర్, మంగళవారం: బీ2 vs ఏ2 — గ్కెబెర్హా

10 నవంబర్, బుధవారం: ఏ3 vs బీ3 — బ్లోమ్‌ఫొంటెయిన్

11 నవంబర్, గురువారం: ఏ1 vs ఏబీ4 — గ్కెబెర్హా

12 నవంబర్, శుక్రవారం: బీ2 vs బీ1 — కేప్‌టౌన్

13 నవంబర్, శనివారం: ఏ2 vs ఏ3 — బ్లోమ్‌ఫొంటెయిన్

14 నవంబర్, ఆదివారం: ఏ1 vs బీ3 — డర్బన్

సెమీఫైనల్స్, ఫైనల్

17 నవంబర్, బుధవారం: సెమీఫైనల్ 1 — కేప్‌టౌన్

18 నవంబర్, గురువారం: సెమీఫైనల్ 2 — ష్వానే

21 నవంబర్, ఆదివారం: ఫైనల్ — జోహన్నెస్‌బర్గ్

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us