ICC: ప్లేయింగ్ 11లో రాంగ్ రూల్స్.. కట్‌చేస్తే.. లీగ్‌నే రద్దు చేసిన ఐసీసీ.. షాకైన సచిన్

ICC banned National Cricket League USA: అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లోని ఇతర దిగ్గజాలు కూడా ఉన్నారు. వివియన్ రిచర్డ్స్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, జహీర్ అబ్బాస్, దిలీప్ వెంగ్‌సర్కార్, మొయిన్ ఖాన్, వెంకటేష్ ప్రసాద్ వంటి చాలా మంది పెద్ద దిగ్గజాలు అనుబంధం కలిగి ఉన్నారు.

ICC: ప్లేయింగ్ 11లో రాంగ్ రూల్స్.. కట్‌చేస్తే.. లీగ్‌నే రద్దు చేసిన ఐసీసీ.. షాకైన సచిన్
Ncl Usa

Updated on: Dec 10, 2024 | 12:49 PM

ICC banned National Cricket League USA: ప్రపంచ క్రికెట్ అతిపెద్ద సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను శాసిస్తున్న ఐసీసీ సోమవారం నాడు అమెరికాలో నేషనల్ క్రికెట్ లీగ్‌ను నిషేధించింది. గత కొన్నేళ్లుగా, అమెరికా క్రికెట్ క్రికెట్ ప్రపంచంలో తన బలాన్ని ఏర్పరచుకుంది. క్రికెట్‌లో తన మూలాలను క్రమంగా బలోపేతం చేస్తోంది.

మెల్లమెల్లగా క్రికెట్ రంగంలో తన పేరును చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా క్రికెట్‌కు అక్కడ లీగ్‌ను ఐసీసీ నిషేధించడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ లీగ్ భవిష్యత్తు ఎడిషన్లను తాము ఆమోదించబోమని తెలియజేస్తూ ఐసిసి యూఎస్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది.

ఐసీసీ అమెరికా లీగ్‌పై నిషేధం..

ఈ అమెరికన్ లీగ్‌ని నిషేధించడం వెనుక ప్రధాన సమస్య దాని ప్లేయింగ్-11. ఈ లీగ్‌లో ప్లేయింగ్-11 నిబంధనలను పాటించలేదని ఐసీసీ పేర్కొంది. ఇక్కడ ప్రతి జట్టులో కనీసం ఏడుగురు అమెరికన్ ఆటగాళ్లు ఉండాలి. లీగ్ ప్రారంభానికి ముందే అధికారులకు సమాచారం అందించారు. ఇదొక్కటే కాదు, లీగ్‌లో విదేశీ ఆటగాళ్లకు అవకాశం కల్పించడానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించింది.

ఇవి కూడా చదవండి

సచిన్ టెండూల్కర్‌కు కూడా లీగ్‌తో ప్రత్యేక అనుబంధం..

ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యం అమెరికా క్రికెట్ జట్టుపై పెద్దగా ప్రభావం లేదు. అయితే, ఇక్కడ క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు గత కొన్నేళ్లుగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ USA లీగ్‌తో భారతదేశపు గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌కు కూడా సంబంధం ఉంది. గాడ్ ఆఫ్ క్రికెట్ ఈ లీగ్ యాజమాన్య సమూహంలో భాగం. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ప్రకటిస్తూ, క్రికెట్ నా జీవితంలో అతిపెద్ద ప్రయాణం అని, అమెరికాలో ఆట కోసం ఇంత ఉత్తేజకరమైన సమయంలో నేషనల్ క్రికెట్ లీగ్‌లో చేరడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లోని ఇతర దిగ్గజాలు కూడా ఉన్నారు. వివియన్ రిచర్డ్స్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, జహీర్ అబ్బాస్, దిలీప్ వెంగ్‌సర్కార్, మొయిన్ ఖాన్, వెంకటేష్ ప్రసాద్ వంటి చాలా మంది పెద్ద దిగ్గజాలు అనుబంధం కలిగి ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..