ICC Announces Test Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో మొదటి పది ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను టీమిండియా ప్లేయర్లు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్స్ 919 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక భారత్‌కు చెందిన టీమిండియా రథసారథి విరాట్ కోహ్లి 862 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా (గతంలోనూ ఇదే ర్యాంకులో ఉన్నాడు).. చతేశ్వర్ పుజారా 760 పాయింట్లతో ఒక స్థానం పెరిగి ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే 748 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక రెండవ స్థానంలో 891 పాయింట్లతో స్టీవ్ స్మిత్, 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడవ స్థానంలో నిలిచాడు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. భారత్ నుంచి అశ్విన్ 760 పాయింట్లతో 8వ స్థానంలో నిలవగా.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 757 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఇక 908 పాయింట్లతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ టాప్ 10లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. పాట్ తర్వాతి స్థానాల్లో.. స్టువర్ట్ బ్రాడ్(839), నీల్ వాగ్నర్(825), జోష్ హాజిల్‌వుడ్(816), టిమ్ సౌథీ(811) పాయింట్లతో వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో ఇంగ్లండ్ ప్లేయర్.. బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో నిలవగా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండవ, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Also Read: Ajinkya rahane: మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న రహానే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..