
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన గ్రౌండ్‌లో చేసిన ప్రదర్శన వల్ల కాదు, తన వ్యక్తిగత జీవితం వల్ల. ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) సందర్భంగా హార్దిక్ తన ప్రియురాలు, మోడల్ కమ్ యాక్ట్రెస్ మహీకా శర్మతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా తన కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. వాలెంటైన్స్ డే వేడుకల కోసం మహీకా శర్మ ప్రత్యేకంగా ఢిల్లీ చేరుకున్నారు. హార్దిక్ బస చేసిన హోటల్ రూమ్‌లో బెడ్‌పై కూర్చుని, చేతిలో భారీ గులాబీ పూల బొకే పట్టుకున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమయానికి ఢిల్లీ చేరుకున్నాను.. నా జీవితంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనికి హార్దిక్ కూడా స్పందిస్తూ.. నా బేబీ పుట్టినరోజు, వాలెంటైన్ వీక్ మొదలైంది అంటూ రీపోస్ట్ చేశారు.
ఎవరీ మహీకా శర్మ?
24 ఏళ్ల మహీకా శర్మ కేవలం మోడల్ మాత్రమే కాదు, ఆమె ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన విద్యావంతురాలు కూడా. ప్రస్తుతం ఆమె మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నారు. పలు మ్యూజిక్ వీడియోలు, ఇండిపెండెంట్ సినిమాల్లో నటించిన మహీకా.. మంచి యోగా ట్రైనర్ కూడా. 2025 అక్టోబర్‌లో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎయిర్‌పోర్టుల్లో, వెకేషన్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నారు.
హార్దిక్ కొడుకుతో మహీకా బాండింగ్
హార్దిక్ పాండ్యాకు తన మాజీ భార్య నటాషా స్టాన్‌కోవిచ్ ద్వారా జన్మించిన కుమారుడు అగస్త్యతో కూడా మహీకా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. అగస్త్యను మహీకా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హార్దిక్ తన మెడపై M అనే అక్షరాన్ని టాటూ వేయించుకోవడంతో వీరిద్దరి బంధం ఎంత బలమైనదో అర్థమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి