Team India Captain: ఆ ఆటగాడు టీమిండియా కెప్టెన్ కావొచ్చు.. సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

May 31, 2022 | 11:30 AM

ఆదివారం జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో మాజీ ఛాంపియన్ రాజస్థాన్‌పై హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది.

Team India Captain: ఆ ఆటగాడు టీమిండియా కెప్టెన్ కావొచ్చు.. సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Team India
Follow us on

Hardik Pandya: హార్దిక్ పాండ్య.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు. IPL – 2022లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)ను ఛాంపియన్‌గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ పాండ్య.. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో మాజీ ఛాంపియన్ రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి గుజరాత్ ఛాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ కెప్టెన్ పాండ్య ఫైనల్ మ్యాచ్‌లో తనదైన ఆల్ రౌండర్ ప్రతిభతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించడంతో పాటు 30 బంతుల్లో 34 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.

ఐపీఎల్ 2022 టోర్నీలో హార్దిక్ పాండ్య.. ఎనిమిది వికెట్లు సాధించడంతో పాటు 487 పరుగులు సాధించాడు. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యలో నాయకత్వ లక్షణాలను పలువురు మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. టీమిండియాకు భావి కెప్టెన్ హార్దిక్ పాండ్యగా కొనియాడుతున్నారు.

Hardik Pandya

హార్దిక్ తప్పనిసరిగా సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీకి పోటీదారుగా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన ఒక్కడి అంచనా కాదని.. అందరిదిగా పేర్కొన్నారు. హార్దిక్‌తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు కెప్టెన్సీ పోటీలో ఉన్నారని అన్నారు. టీమిండియాకు పాండ్యనే తదుపరి కెప్టెన్ అని చెప్పలేనని అన్నారు. అయితే సెలక్షన్ కమిటీకి పాండ్య రూపంలో చక్కటి ప్రత్యామ్నాయం కనిస్తోందని అన్నారు. నాయకత్వ లక్షణాలు ఉంటే టీమిండియా జాతీయ జట్టుకు సారథ్యంవహించే అవకాశం తప్పనిసరిగా లభిస్తుందని స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి..