Chennai Super Kings vs Gujarat Titans, IPL 2023 Final Highlights: ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో CSK 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. 25 బంతుల్లో 47 పరుగులు చేసిన డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. చివరి రెండు బంతుల్లో CSKకి 10 పరుగులు కావాలి. ఐదో బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ బాదిన రవీంద్ర జడేజా సీఎస్‌కేను ఐపీఎల్‌లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిపాడు. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ఆటగాళ్లలో రోహిత్‌ను సమం చేశాడు.
రోహిత్ తన కెప్టెన్సీలో ఐదుసార్లు ముంబైని విజేతగా నిలిపాడు. ఇప్పుడు ధోనీ కూడా చెన్నైని ఐదుసార్లు ఛాంపియన్‌గా మార్చాడు. చెన్నై ఇంతకు ముందు 2010, 2011, 2018, 2021లో టైటిల్ గెలుచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. టాస్ గెలిచిన ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.
ఐపీఎల్ చివరి మ్యాచ్ మధ్య అహ్మదాబాద్ వాతావరణం గురించి మాట్లాడితే.. ఆక్వా వెదర్ ప్రకారం, ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
అదే సమయంలో, బీబీసీ వెదర్ ప్రకారం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రకంగా చూస్తే ఈరోజు కూడా మ్యాచ్‌కు కొంత సేపు అంతరాయం కలగవచ్చు.
CSK 10వ సారి ఫైనల్ ఆడనుంది. చెన్నై జట్టు 4 సార్లు టైటిల్ గెలుచుకుంది. గుజరాత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్స్‌కు చేరుకోగా, గతేడాది కూడా ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈరోజు మళ్లీ వర్షం పడితే ఏమవుతుందో తెలుసా?
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల చేయాల్సి ఉండేది. అయితే మ్యాచ్‌కు వర్షం అడ్డు పడింది. దీంతో ఆట నిలిచిపోయింది. చివరకు వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత గుజరాత్-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ 12.10 గంటలకు ప్రారంభమైంది. చెన్నై సూపర్‌కింగ్స్ విజయ లక్ష్యం 171 పరుగులు.
ఐపీఎల్ ఫైనల్‌లో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతిలో ఫలితం రావాలంటే రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్ల ఆట అవసరం . 5 ఓవర్ల ఆట పూర్తి కావడానికి తెల్లవారుజామున 12:36 వరకు వేచి ఉండాలి. అప్పుడు కూడా 5 ఓవర్లు పూర్తి చేయకపోతే ఫైనల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు.
ఫైనల్ క్యాన్సిల్ అయితే?
ఈరోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఐపీఎల్ లీగ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఐపీఎల్ ఫైనల్ జరగకుంటే గుజరాత్ విజేతగా నిలిచి వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంటుంది.
గత సీజన్‌లోని వాతావరణ పరిస్థితుల ప్రకారం, రిజర్వ్ డేలో కూడా ఫైనల్ జరగకపోతే, లీగ్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.
గుజరాత్ అందించిన 215 పరుగుల టార్గెట్‌ను ఛేందిచేందుకు చెన్నై ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వాయ్ బరిలోకి దిగారు. అయితే, ఆ జట్టు 0.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది. చెన్నై బౌలర్లలో మతిష్ పతిరనా 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
18 ఓవర్లలో గుజరాత టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 33 బంతుల్లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు.
16 ఓవర్లలో గుజరాత టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 33 బంతుల్లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
14 ఓవర్లలో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 20 బంతుల్లో 39 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. అనంతరం 54 పరుగులు చేసిన సాహా పెవిలియన్ చేరాడు.
గుజరాత్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా 36 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. పవర్‌ప్లే ఓవర్లలోనే భారీ షాట్లు కొట్టడం ప్రారంభించాడు. అతను మొదట గిల్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి యాభై భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశాడు.
11.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. 20 బంతుల్లో 39 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ కళ్లు చెదిరే స్టంప్ అవుట్ చేశాడు. సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నారు.
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో ధోనీ డేంజరస్ ప్లేయర్ గిల్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో గిల్ 39 పరగుల వద్ద వికెట్ కోల్పోయాడు.
6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా గుజరాత్ 62 పరుగులు చేసింది.
వరుస బౌండరీలతో గిల్, సాహా దూకుడు పెంచారు. దీంతో 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. గిల్ 17, సాహా 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ధోనీ.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చెన్నై వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ షురూ చేశారు.
అహ్మదాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచి వర్షం కురవలేదు. ఇప్పటి వరకు వాతావరణం బాగానే ఉంది.
2011 నుంచి జరిగిన 12 ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌లు, క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఫైనల్‌లోనూ విజయం సాధించింది. అంటే ఇప్పుడు కూడా అదే నిజమైతే.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది.
ఈరోజు మళ్లీ వర్షం పడితే ఏమవుతుందో తెలుసా?
ఐపీఎల్ చివరి మ్యాచ్ మధ్య అహ్మదాబాద్ వాతావరణం గురించి మాట్లాడితే.. ఆక్వా వెదర్ ప్రకారం, ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
అదే సమయంలో, బీబీసీ వెదర్ ప్రకారం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రకంగా చూస్తే ఈరోజు కూడా మ్యాచ్‌కు కొంత సేపు అంతరాయం కలగవచ్చు.
ఐపీఎల్ 2023 ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారుతోంది. అహ్మదాబాద్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు వర్షం కారణంగా ఫైనల్‌పై టెన్షన్ తెరపడింది. ఈ మ్యాజ్ సోమవారానికి వాయిదా పడింది. చెన్నై వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. సోమవారం ఈ రెండు జట్లు కూడా తలపడనున్నాయి. వర్షం ఎంతకి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో 20 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశాలు లేవు. దీంతో ఓవర్లలో కోత విధించాల్సి వస్తోంది. 9.45లో మొదలైతే 19 ఓవర్ల చొప్పున, 10గంటలకు మొదలైతే 17 ఓవర్ల చొప్పున, 10.30 గంటలకు మొదలైతే 15 ఓవర్ల చొప్పున సాగనుంది. అదే 120.5 దాటితే మాత్రం కేవలం 5 ఓవర్ల చొప్పునే మ్యాచ్ నిర్వహిస్తారు. ఇలా కూడా సాధ్యం కాకపోతే.. రేపు సోమవారం నాడు మ్యాచ్ నిర్వహించనున్నారు.
గుజరాత్ వర్సెస్ చెన్నై మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు తగ్గడం లేదు. దోబుచులాడుతోంది. దీంతో 20 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరిగేందుకు మరో 30 నిమిషాలే ఉంది. అంటే 9.35గంటలలోపే మ్యాచ్ ప్రారంభం కావాల్సిందే. లేదంటే ఓవర్లలో కోత విధించనున్నారు.
ప్రస్తుతానికైతే వర్షం కాస్త తగ్గింది. దీంతో పిచ్‌ను రెడీ చేసేందుకు సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. ఆ తర్వాత అంపైర్లు రంగంలోకి దిగి, టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
అహ్మదాబాద్‌లో తేలికపాటి వర్షం ప్రారంభమైంది. కవర్లు మైదానంలోకి వచ్చాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫైనల్‌లో వర్షం కారణంగా మ్యాచ్ సమయం పొడిగించే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు.
All the action, drama, emotion which is set to get captured by more than 50 different cameras across the stadium ?
Mr. Dev Shriyan, Director – Production and Broadcast breaks down the coverage of the Final Showdown for us????#TATAIPL | #CSKvGT | #Final pic.twitter.com/pankEr6VHz
— IndianPremierLeague (@IPL) May 28, 2023
ఫైనల్ సమరానికి ఇరుజట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్టేడియానికి చేరుకుని, మైదానాన్ని పరిశీలించి, వ్యూహాలకు పదును పెడుతున్నారు.
టాస్ తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో ఇరుజట్లతోపాటు అభిమానుల్లోనూ టెన్షన్ మొదలైంది.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై క్వాలిఫయర్ 1లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించగా, క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన గుజరాత్‌కు మరో అవకాశం లభించింది. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ టీం ఫైనల్‌కు చేరుకుంది.
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 28 మే 2011న చెన్నై రెండో టైటిల్‌ను గెలుచుకుంది. 12 ఏళ్ల క్రితం జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై ఓడించింది.
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా మధ్య హై వోల్టేజ్ పోటీకి రంగం సిద్ధమైంది.