
GT vs CSK : ఐపీఎల్ 2026లో నేడు (మే 21, గురువారం) అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కాబోతోంది. టోర్నమెంట్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తలపడనుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన చెన్నై.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే రుతురాజ్ సేనకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు ఇప్పటికే 16 పాయింట్లతో టాప్‌లో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచి మొదటి రెండు స్థానాల్లో నిలవాలని స్కెచ్ వేసింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్‌కే వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ బొటనవేలి గాయం కారణంగా ఈ కీలక మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేడు. అతను ఇప్పటికే జట్టును వీడి రాంచీలోని తన ఇంటికి చేరుకున్నట్లు మేనేజ్‌మెంట్ ధృవీకరించింది. ధోనీ లేకపోవడం చెన్నై మిడిలార్డర్ బ్యాటింగ్‌ను, అలాగే మైదానంలో వ్యూహాలను గట్టిగా దెబ్బతీసే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ సక్సెస్‌కు ప్రధాన కారణం వారి డెడ్లియెస్ట్ బౌలింగ్ అటాక్. ఐపీఎల్ 2026 లోనే అత్యుత్తమ బౌలింగ్ సగటు (24.34), ఎకానమీ (9.1) కలిగిన జట్టు ఇదే. ముఖ్యంగా అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్‌లో వీరి పేస్ బౌలింగ్ ట్రాక్ రికార్డ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పవర్‌ప్లేలో అత్యధికంగా 16 వికెట్లు తీసిన కాగిసో రబడ, జతగా మహ్మద్ సిరాజ్ చెన్నై ఓపెనర్లకు నరకం చూపించనున్నారు. మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ (అహ్మదాబాద్ లో 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) లతో పాటు స్పిన్ కింగ్ రషీద్ ఖాన్ చెన్నైని ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీగా ఉన్నారు.
ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధికంగా 26 వికెట్లు కోల్పోయిన జట్టుగా చెన్నై చెత్త రికార్డు మూటగట్టుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పవర్‌ప్లేలో కేవలం 121 స్ట్రైక్ రేట్‌తో తడబడుతుండటం జట్టుకు మైనస్‌గా మారింది. అయితే, గుజరాత్‌పై రుతురాజ్‌కు 60 సగటుతో 424 పరుగులు చేసిన సూపర్ రికార్డ్ ఉంది. అదే సమయంలో, ఈ సీజన్‌లో అవే మ్యాచ్‌లలో (అవే గ్రౌండ్స్‌లో) 57.5 సగటుతో అదరగొడుతున్న సంజూ శాంసన్ పైనే చెన్నై భారీ స్కోరు భారాన్ని వేసింది. స్పిన్‌ను ఆడటంలో సీఎస్‌కే బ్యాటర్లు వీక్ కావడంతో రషీద్ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
అహ్మదాబాద్ పిచ్ ఈసారి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించేలా అన్‌ఈవెన్ బౌన్స్‌తో ఉండే అవకాశం ఉంది. ఈ వేగాన్ని తట్టుకునేందుకు వీలుగా చెన్నై జట్టులోకి గుర్జాప్‌నీత్ సింగ్‌ను తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. అలాగే అవే మ్యాచ్‌లలో భారీగా పరుగులు ఇస్తున్న అన్షుల్ కంబోజ్ స్థానంలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. గుజరాత్ జట్టులోకి వారి బెస్ట్ హోమ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి 180+ రన్స్ బోర్డుపై పెడితే చేజింగ్ చేయడం ప్రత్యర్థికి అసాధ్యంగా మారుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..