Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

Glenn Phillips One Handed Catch Video: ఒక చేత్తో క్యాచ్‌.. అదీ బౌండరీ లైన్‌ దగ్గర! ఫిలిప్స్‌ చేసిన ఈ ఫీట్‌ మరోసారి అతడెందుకు ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడో నిరూపించింది. గయానా అమెజాన్‌ వారియర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కళ్లు చెదిరే క్యాచ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!
Glenn Phillips One Handed Catch

Updated on: Sep 01, 2026 | 12:36 PM

Glenn Phillips One Handed Catch Video: క్రికెట్‌లో క్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. మ్యాచ్ లను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి క్యాచ్ లు పట్టేందుకు ఫీల్డర్లు తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెడుతుంటారు. ఈక్రమంలో కొన్ని క్యాచ్‌లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. పట్టిన ఆటగాడే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL) 2026లో న్యూజిలాండ్‌ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అలాంటి అద్భుతమే చేశాడు. బౌండరీ లైన్‌ వద్ద ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. క్యాచ్‌ పూర్తయిన తర్వాత ఫిలిప్స్‌ కూడా కొద్దిసేపు నమ్మలేకపోవడం గమనార్హం.

సిక్సర్‌ అనుకున్న షాట్‌.. క్యాచ్‌గా..!

గయానా అమెజాన్‌ వారియర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. గయానా తొలుత 186 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో ట్రిన్‌బాగో 17/0తో ఉన్న సమయంలో డ్వేన్‌ ప్రిటోరియస్‌ వేసిన బంతిని సునీల్‌ నరైన్‌ భారీ షాట్‌గా ఆడాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

బంతి డీప్‌ మిడ్‌ వికెట్‌ వైపు వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఫిలిప్స్‌కు అది సిక్సర్‌గా వెళ్లేలా కనిపించింది. అయితే లాస్ట్ మినిట్ లో అతడు కుడివైపు కదులుతూ ఒక్కసారిగా తన కుడి చేతిని గాల్లోకి చాపాడు. అంతే.. గాల్లో దూసుకెళ్తున్న బంతి అతడి చేతిలో పడిపోయింది..!

ఫిలిప్స్‌ రియాక్షన్‌ వైరల్‌.!

క్యాచ్‌ అందుకున్న వెంటనే ఫిలిప్స్‌ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాను పట్టిన క్యాచ్‌ను తానే నమ్మలేకపోయినట్లు అతడు కొద్దిసేపు ఆశ్చర్యంగా నిల్చుని చూస్తుండిపోయాడు.

క్యాచ్‌ వీడియోను సీపీఎల్ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది. అభిమానులు ఈ ఫీట్‌ను చూసి ఫిలిప్స్‌ను మరోసారి ‘సూపర్‌మ్యాన్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు..

గ్లెన్‌ ఫిలిప్స్‌ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఒంటి చేత్తో, డైవ్‌ చేస్తూ, గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌లు పట్టడంలో అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి ఖాతాలో ఇప్పటికే 112 క్యాచ్‌లు ఉన్నాయి.

మ్యాచ్‌లో హెట్‌మేయర్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ఫిలిప్స్‌ క్యాచ్‌ మాత్రమే కాదు.. గయానా బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మయర్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 43 బంతుల్లో 111 పరుగులు బాది గయానా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రొమారియో షెపర్డ్‌ 7 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

లక్ష్య ఛేదనలో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ 172 పరుగులకే పరిమితమైంది. అలెక్స్‌ హేల్స్‌ 24 బంతుల్లో 55, నికోలస్‌ పూరన్‌ 16 బంతుల్లో 43 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. గయానా బౌలర్లలో మహ్మద్‌ నబీ 3 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us