బిగ్ బాష్ లీగ్ 28వ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ స్టేడియంలో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరపున ఆడిన మాక్స్‌వెల్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 58 పరుగులు చేశాడు. ఈ 58 పరుగులతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బిగ్ బాష్ లీగ్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీనితో పాటు బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా మ్యాక్స్‌వెల్ రికార్డు సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు క్రిస్ లిన్ పేరిట ఉండేది. 2011 నుంచి బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న క్రిస్ లిన్ 2,016 బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో బీబీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగుల మార్క్‌ను దాటిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 1,955 బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో 2000 కంటే తక్కువ బంతుల్లో 3000 పరుగుల మార్కును దాటిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా అతనే.
బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటివరకు 110 ఇన్నింగ్స్‌లు ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్ 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలతో మొత్తం 3047 పరుగులు చేశాడు. ప్రస్తుతం పరుగుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్ (3908)ను అధిగమించేందుకు 862 పరుగులు చేయాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..