ప్రపంచకప్‌లో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్‌ను పరాజయం పలకరించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. మాథ్యూస్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను లసిత్ మలింగ దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే బెయిర్‌స్టోను ఔట్ చేశాడు. తర్వాత విన్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ స్థితిలో రూట్, మోర్గాన్ పోరాడి జట్టును గాడిలో పెట్టారు. కానీ… మళ్లీ రూట్‌ను ఔట్ చేసిన మలింగ.. లంక జట్టులో ఆశలు కల్పించాడు. తర్వాత బట్లర్ వికెట్ తీశాడు.
ఇక మరో బౌలర్ ధనంజయ కూడా సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. వోక్స్, రషీద్‌లను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ లంక చేతిలోకి వచ్చేసినట్లు కనిపించింది. అయితే స్టోక్స్ పట్టు వదల్లేదు. చివర్లో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కానీ వుడ్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. స్టోక్స్ శ్రమ వృథా అయింది.