AB De Villiers on Gambhir : గంభీర్ ఎమోషనల్ అయితే కష్టమే..ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

సౌతాఫ్రికాతో జరిగిన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్ కావడంతో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టెస్ట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమవడంతో, గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AB De Villiers on Gambhir : గంభీర్ ఎమోషనల్  అయితే కష్టమే..ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్
Ab De Villiers On Gambhir

Updated on: Nov 29, 2025 | 10:54 AM

AB De Villiers on Gambhir : సౌతాఫ్రికాతో జరిగిన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్ కావడంతో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టెస్ట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమవడంతో, గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్, రవిచంద్రన్ అశ్విన్‌తో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాడిగా గంభీర్ ఎమోషనల్ అవతార్ తనకు తెలుసని, కోచ్‌గా కూడా డ్రెస్సింగ్ రూంలో అదే భావోద్వేగాలను కొనసాగిస్తే అది జట్టుకు మంచిది కాదని డివిలియర్స్ బాంబ్ పేల్చారు.

సౌతాఫ్రికా తరఫున ఆడిన గొప్ప ఆటగాళ్లలో ఒకరైన ఏబీ డివిలియర్స్, కోచ్‌గా గౌతమ్ గంభీర్ నాయకత్వ శైలి గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “భారత జట్టు గురించి చెప్పాలంటే ఇది నిజంగా కష్టం. నాయకత్వ విషయంలో GG (గౌతమ్ గంభీర్) ఎలా ఉంటారో నాకు తెలియదు. ఆటగాడిగా అతను చాలా ఎమోషనల్ వ్యక్తి అని నాకు తెలుసు. ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్‌గా కూడా అతను అదే విధంగా ఎమోషనల్‌గా ఉంటే, అది సాధారణంగా జట్టుకు మంచిది కాదు” అని డివిలియర్స్ అన్నారు.

అయితే తెరవెనుక గంభీర్ ఎలాంటి కోచ్ లేదా నాయకుడు అనే విషయం తనకు తెలియదని, ఏది సరైనది, ఏది తప్పు అని చెప్పలేనని కూడా డివిలియర్స్ స్పష్టం చేశారు. కొంతమంది ఆటగాళ్లకు మాజీ ఆటగాడు కోచ్‌గా ఉండటం సౌకర్యంగా ఉంటుంది, మరికొందరికి ఆటకు సంబంధం లేని అనుభవజ్ఞుడైన కోచ్ కంఫర్ట్‌గా ఉంటారని ఆయన వివరించారు.

రవిచంద్రన్ అశ్విన్, గంభీర్, సౌతాఫ్రికా కోచ్ శుక్రి కాన్రాడ్‎ల విభిన్న కోచింగ్ శైలులే సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేశాయా అని డివిలియర్స్‌ను అడిగారు. “ఇది కష్టమైన ప్రశ్న, ఎందుకంటే నేను శుక్రి కింద ఎప్పుడూ ఆడలేదు అలాగే గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్చేట్ ఉన్న భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా నేను లేను. టీమ్‌లో అది గొప్పగా కనిపిస్తుంది, కానీ తెరవెనుక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు” అని డివిలియర్స్ చెప్పారు.

తాను గ్యారీ కిర్‌స్టన్ వంటి మాజీ ఆటగాడి కింద ఆడటం చాలా ఇష్టమని, ఇది కొందరు ఆటగాళ్లకు ఉత్సాహం ఇస్తుందని డివిలియర్స్ తెలిపారు. భారత జట్టు అన్ని విభాగాల్లో పదేపదే తప్పులు చేయడంతో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలి, జట్టు ఎంపికపై నిరంతరంగా విమర్శలు కొనసాగుతున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..