Virender Sehwag: ధోని కారణంగానే సెహ్వాగ్‌ రిటైర్మెంట్‌..? అసలు విషయం బయటపెట్టిన మాజీ డాషింగ్‌ ఓపెనర్..!

|

Jun 01, 2022 | 6:42 PM

Virender Sehwag: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ కెప్టెన్‌గా ఎన్నో పెద్ద టోర్నీలు గెలిచి టీమ్ ఇండియాకు మరిచిపోలేని విజయాలని అందించాడు.

Virender Sehwag: ధోని కారణంగానే సెహ్వాగ్‌ రిటైర్మెంట్‌..? అసలు విషయం బయటపెట్టిన మాజీ డాషింగ్‌ ఓపెనర్..!
Virender Sehwag
Follow us on

Virender Sehwag: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ కెప్టెన్‌గా ఎన్నో పెద్ద టోర్నీలు గెలిచి టీమ్ ఇండియాకు మరిచిపోలేని విజయాలని అందించాడు. ఈ సమయంలో అతను చాలాసార్లు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులోని మాటని వెల్లడించాడు. ధోని చేసిన పనుల వల్ల తాను బలవంతంగా రిటైర్మెంట్‌ చేయవలసి వచ్చందని చెప్పాడు. 2007లో ధోనీకి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మొదట టీ20లో కెప్టెన్‌గా వ్యవహరించి ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అప్పటికే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌కి అవి గడ్డు రోజులు. ఆ సమయంలో ధోనీ జట్టులో మార్పులు చేస్తుండగా సెహ్వాగ్ అతని నిర్ణయాలకు బలయ్యాడు. దీంతో వన్డే ఫార్మాట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకాలనే ఆలోచన చేశాడు.

2008లో ధోనీ ప్లేయింగ్ XI నుంచి సెహ్వాగ్‌ని తప్పించాడు..

2008లో ఆస్ట్రేలియాలో భారత్ ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భారత్, ఆతిథ్య జట్టుతో పాటు శ్రీలంక కూడా భాగమైంది. ఇక్కడ సెహ్వాగ్ పరుగుల కోసం పోరాడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 6, 33, 11, 14 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే ధోనీ అతడిని జట్టు నుంచి తప్పించాడు. ఆ సమయంలో సెహ్వాగ్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ ‘2008 సంవత్సరంలో మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం ప్రారంభించాను. వన్డేల్లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాను. ధోనీ నన్ను ప్లేయింగ్ XI నుంచి తప్పించాడు. అందుకే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే ఆలోచన మొదలుపెట్టాను’ అన్నాడు.

ఇవి కూడా చదవండి

సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు సెహ్వాగ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు..

వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి సచిన్ టెండూల్కర్ తనను అనుమతించలేదని సెహ్వాగ్ చెప్పాడు. సెహ్వాగ్‌ను అర్థం చేసుకుని ‘ఇది మీ పేలవమైన ఫామ్ మాత్రమే. ఈ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లి బాగా ఆలోచించి తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోండని చెప్పాడు. రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. దీంతో సెహ్వాగ్‌ 2013లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడానని చెప్పాడు. వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్లు ప్రస్తావించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి