సన్ రైజర్స్‌ను ఇంటికి పంపిన పంత్

ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. హైదరాబాద్‌కు దక్కినట్టే దక్కిన విజయన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్.. వరుస పంచ్‌లతో బలవంతంగా లాగేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ రెండు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించి చెన్నైతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. […]

సన్ రైజర్స్‌ను ఇంటికి పంపిన పంత్
TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2019 | 12:38 PM

ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. హైదరాబాద్‌కు దక్కినట్టే దక్కిన విజయన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్.. వరుస పంచ్‌లతో బలవంతంగా లాగేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

ఐపీఎల్‌లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ రెండు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించి చెన్నైతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 36, మనీష్ పాండే 30, కెప్టెన్ కేన్ విలిమ్సన్ 28, విజయ్ శంకర్ 25, నబీ 20 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు.

సన్‌రైజర్స్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో బంతి మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పృథ్వీషా హాఫ్ సెంచరీకి తోడు రిషభ్ పంత్ చెలరేగడంతో ఢిల్లీకి విజయం సొంతమైంది. ఓ దశలో ఢిల్లీ ఓటమికి చేరువలో ఉందనుకోగా.. ఆపద్బాంధవుడిలా వచ్చిన పంత్.. జట్టును ఆదుకున్నాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, శుక్రవారం జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత 12న జరిగే ఫైనల్‌లో ముంబైతో తలపడనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu