AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK Captain: చెన్నై కెప్టెన్సీలో కీలక మార్పు.. ఐపీఎల్ 2027లో జట్టును నడిపించేది ఎవరంటే?

CSK Captain 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా తెచ్చి, కోచింగ్ స్టాఫ్‌ను ప్రక్షాళన చేసిన సీఎస్‌కే.. కెప్టెన్సీపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్‌కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. నూర్ అహ్మద్ భవిష్యత్తుపై కూడా బిగ్ అప్‌డేట్ వచ్చింది.

CSK Captain: చెన్నై కెప్టెన్సీలో కీలక మార్పు.. ఐపీఎల్ 2027లో జట్టును నడిపించేది ఎవరంటే?
Csk 2027
Venkata Chari
|

Updated on: Nov 12, 2026 | 12:49 PM

Share

CSK Captain 2027: 2023 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అభిమానుల అంచనాలకు తగ్గట్టు లేదు. 2026 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరలేక ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో 2027 సీజన్ కోసం యాజమాన్యం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. తొలి అడుగుగా కోచింగ్ స్టాఫ్‌ను దాదాపు పూర్తిగా మార్చేసింది. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. తన పాత ఆటగాళ్లకే కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గారెత్ బ్యాటీకి అసిస్టెంట్ కోచ్ పగ్గాలు ఇచ్చింది.

ఆ తర్వాత ట్రేడ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత సీజన్ ఆడిన లియామ్ లివింగ్‌స్టోన్, స్కాట్ ఎడ్వర్డ్స్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే అభిమానుల్లో అసలైన చర్చ కెప్టెన్సీపైనే నడిచింది. రుతురాజ్ కొనసాగుతాడా, కొత్త కెప్టెన్ వస్తాడా అనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది.

రుతురాజ్‌కే మరో ఛాన్స్.. 2028 మెగా వేలానికి ముందు చివరి అవకాశమా?

2024లో ఎంఎస్ ధోనీ నుంచి రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి 33 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేయగా కేవలం 13 విజయాలు మాత్రమే దక్కాయి, 19 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా వచ్చాక రుతురాజ్ కెప్టెన్సీకే ముప్పు అనే ప్రచారం జరిగింది.

ఎక్కువమంది చదివినది: Video: 49 ఫోర్లు, 21 సిక్సర్లు.. ఇది విధ్వంసం కాదయ్యా.. 487 పరుగులతో బీభత్సం..

కానీ మీడియా రిపోర్టుల ప్రకారం సీఎస్‌కే యాజమాన్యం రుతురాజ్‌కే మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. స్పోర్ట్స్‌తక్ జర్నలిస్ట్ నితిన్ కె. శ్రీవాత్సవ కథనం ప్రకారం.. ‘మెన్ ఇన్ ఎల్లో’ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌నే కొనసాగించనున్నారు.

2028 మెగా వేలానికి ముందు రుతురాజ్‌కు ఇదే ఆఖరి అవకాశం ఇవ్వాలని చెన్నై భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్‌గా అతని ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. కానీ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడంలో, కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడ్డాడనే విమర్శ ఉంది. జహీర్ మార్గదర్శనంలో అతను తనను తాను నిరూపించుకోవాలి. లేకపోతే మెగా వేలం తర్వాత కొత్త శకం మొదలవడం ఖాయం.

నూర్ అహ్మద్ ట్రేడ్ రూమర్లకు తెర.. సీఎస్‌కేతోనే కొనసాగింపు..

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేయబోతోందని కొన్ని మీడియా రిపోర్టులు दावा చేశాయి. అయితే నితిన్ ఈ ప్రచారాన్ని ఖండించారు. నూర్ అహ్మద్ చెన్నైతోనే కొనసాగుతాడని, మరే జట్టుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినది: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. ఫోటోస్ వైరల్.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఎప్పుడంటే?

మెగా వేలంలో చెన్నై అతన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత రెండు సీజన్లలో 28 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీసి తన విలువను నిరూపించుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో నూర్ అహ్మద్ జట్టుకు కీలక అస్త్రం. అందుకే అతన్ని వదులుకోవడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు.

మొత్తంగా చూస్తే.. కోచ్‌గా జహీర్, కెప్టెన్‌గా రుతురాజ్, స్పిన్ విభాగంలో నూర్.. ఈ ముగ్గురిపై భారం వేసి 2027లో పునరుజ్జీవం కోసం పసుపు దళం బరిలోకి దిగుతోంది. గత రెండేళ్ల గాయాలను మాన్పి అభిమానులకు కప్పు అందించగలదా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us