
Decision Review System Meaning: క్రికెట్‌లో డెసిషన్ రివ్యూ సిస్టం (Decision Review System) లేదా డీఆర్ఎస్ (DRS) కీలకమైన సాంకేతిక విధానంగా మారింది. అంపైర్ ఇచ్చిన ఔట్ (Out) లేదా నాట్ ఔట్ (Not Out) నిర్ణయంపై బ్యాటర్, ఫీల్డింగ్ కెప్టెన్ రివ్యూ కోరవచ్చు. అనంతరం థర్డ్ అంపైర్ అందుబాటులో ఉన్న టెక్నాలజీలతో నిర్ణయాన్ని పరిశీలిస్తాడు. ఎల్బీడబ్ల్యూ (LBW) సమయంలో లీగర్ డెలివరీ (Legal Delivery), సిగ్నో మీటర్, బాల్ ట్రాకింగ్ వంటి అంశాలను చూస్తారు. క్యాచ్‌లకు ఆల్ట్రా ఎడ్జ్ (UltraEdge), రీప్లే (Replay)లను ఉపయోగిస్తారు. ఐసీసీ 2008లో భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌లో డీఆర్ఎష్ ను పరీక్షించగా, 2010లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఫార్మాట్‌ను బట్టి జట్లకు రివ్యూల సంఖ్య ఉంటుంది.
క్రికెట్‌లో అంపైర్ నిర్ణయాలపై సందేహాలు తలెత్తినప్పుడు వాటిని సాంకేతికంగా మరోసారి పరిశీలించేందుకు డీఆర్ఎస్ ను తీసుకొచ్చారు. అంపైర్ ఔట్ లేదా నాట్ ఔట్ గా ఇచ్చిన నిర్ణయం సరైందిగా అనిపించకపోతే బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ చేతులతో ‘టీ’ ఆకారం చూపిస్తూ రివ్యూ కోరవచ్చు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిశీలిస్తాడు.
ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని సమీక్షించే సమయంలో మొదట బంతి లీగర్ డెలివరీనా కాదా అన్నది పరిశీలిస్తారు. ఆ తర్వాత బంతి బ్యాట్‌ను తాకిందా లేదా అనే అంశాన్ని చూస్తారు. చివరగా బాల్ ట్రాకింగ్ (Ball Tracking) ద్వారా బంతి వికెట్లను తాకే అవకాశముందా అన్నది అంచనా వేస్తారు. ఈ సమాచారాన్ని బట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించాలా, మార్చాలా అనేది నిర్ణయిస్తారు.
క్యాచ్ విషయంలోనూ ముందుగా బంతి చట్టబద్ధమైనదేనా అన్నది పరిశీలిస్తారు. అనంతరం బంతి బ్యాట్‌ను తాకిందా లేదా తెలుసుకునేందుకు ఆల్ట్రాఎడ్జ్, అలాగే రీప్లేల ద్వారా క్యాచ్‌ను ఫీల్డర్ సరిగ్గా అందుకున్నాడా అనే అంశాన్ని థర్డ్ అంపైర్ పరిశీలిస్తాడు.
ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!
డీఆర్ఎస్ రివ్యూ నంబర్స్ క్రికెట్ ఫార్మాట్ ను బట్టి మారుతుంది. టెస్ట్ క్రికెట్ (Test cricket) లో ప్రతి ఇన్నింగ్స్ కు ఒక్కో జట్టుకు 3 రివ్యూస్ ఉంటాయి. వన్డే, టీ20ల్లో ఒక్కో ఇన్నింగ్స్ కు 2 రివ్యూస్ చొప్పున లభిస్తాయి. రివ్యూ విజయవంతమైతే ఆ రివ్యూ నంబర్ అలాగే కొనసాగుతుంది. విఫలమైన రివ్యూతో అందుబాటులో ఉన్న సంఖ్య తగ్గుతుంది. అయితే అంపైర్స్ కాల్ వచ్చిన సందర్భంలో రివ్యూ జట్టుకు తిరిగి కొనసాగుతుంది.
ఆర్ఎస్ ను ఐసీసీ 2008లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అనంతరం 2010లో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లోనూ డీఆర్ఎస్ మ్యాచ్‌లలో కీలక భాగంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..