T20 World Cup: కెరీర్‌ డౌన్‌లో ఉంటే ఇలాంటివి వినాల్సిందే.. నాకు తోడుగా ఉన్నందుకు నా భార్యకు కృతజ్ఞతలు: భారత స్పిన్నర్

|

Sep 14, 2021 | 7:19 AM

టీ 20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. టీ 20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు యుజ్వేంద్ర చాహల్.

T20 World Cup: కెరీర్‌ డౌన్‌లో ఉంటే ఇలాంటివి వినాల్సిందే.. నాకు తోడుగా ఉన్నందుకు నా భార్యకు  కృతజ్ఞతలు: భారత స్పిన్నర్
Yuzvendra Chahal
Follow us on

Yuzvendra Chahal: భారత జట్టు మణికట్టు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం గడ్డు దశలో ఉన్నాడు. ఐపీఎల్ మొదటి దశలో పేలవమైన ఫామ్‌తో అతను టీ 20 ప్రపంచకప్‌లో కూడా ఎంపిక కాలేదు. ఈ కారణంగా అతను చాలా నిరాశ చెందాడు. ఏదేమైనా, ఈ క్లిష్ట సమయంలో, అతని భార్య ధనశ్రీ అతనికి మద్దతుగా ఉండడంతో, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

యుజ్వేంద్ర చాహల్ భారత అత్యుత్తమ బౌలర్‌ అనడంలో సందేహం లేదు. టీ 20 లో చాహల్ భారత తరపున అత్యధిక వికెట్లు తీశాడు. టీ 20 క్రికెట్‌లో 49 మ్యాచ్‌ల్లో చాహల్ 63 వికెట్లు తీశాడు. కాకపోతే ఇలాంటి గణాంకాలు టీ20 జట్టులో ఎంపిక కోసం పనికిరాలేదు. జట్టులో అతని పేరు లేకపోవడంతో అభిమానులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తన భార్యకు కృతజ్ఞతలు తెలిసిన చాహల్
ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన సంభాషణలో యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ, ‘నేను ప్రజల సందేశాలను చూస్తున్నాను. వారు నాపై చూపించే ప్రేమకు ధన్యవాదాలు. కెరీర్‌ డౌన్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణం’ అంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 మొదటి దశలో చాహల్ ఏడు మ్యాచ్‌లలో 47.80 సగటు, 8.26 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ తర్వాత చాహల్‌కు కష్టకాలం మొదలైంది. అయితే, చాహల్ భార్య ధనశ్రీ సహకారంతో ఈ స్థితి నుంచి త్వరగా బయటపడతానంటూ చెప్పుకొచ్చాడు. ‘నేను బాగా బౌలింగ్ చేస్తున్నానని నాకు తెలుసు. కానీ, కొన్నిసార్లు టీ 20 క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ దాడి చేయకపోతే వికెట్లు తీయడం చాలా కష్టం. వికెట్లు దక్కనప్పుడు మిమ్మల్ని ఇది చాలా ప్రభావితం చేస్తుంది’ అంటూ వెల్లడించాడు.

టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటించిన రోజు, చాహల్ భార్య ధనశ్రీ స్ఫూర్తిదాయకమైన పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీ తన బాధను వ్యక్తం చేసింది. ‘ ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. జీవితంలో అన్నీ సక్రమంగా జరగవు. నైపుణ్యంతో రాణించేందుకు ఆలోచించాలి. తల ఎత్తి జీవించండి’ అంటూ రాసుకొచ్చింది.

Also Read: Virat Kohli: మాంచెస్టర్ టెస్ట్ రద్దుకు కారణం అదే.. ఎట్టకేలకు మౌనం వీడిన టీమిండియా కెప్టెన్..!

ఇంగ్లాండ్‌ని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు..! విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో నిలిచాడు..

Shane Warne: టీమిండియ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేన్‌ వార్న్‌..