AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 బంతుల్లో 0 పరుగులు, 4 వికెట్లు.. ఇలాంటోడు ఒక్కడుంటే చాలు భయ్యా..!

Chris Green 300th T20: సీపీఎల్ 2026లో క్రిస్ గ్రీన్ అద్భుత బౌలింగ్‌తో బార్బడోస్ ట్రైడెంట్స్ సత్తా చాటింది. సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌పై నాలుగు వికెట్లతో విరుచుకుపడ్డ గ్రీన్.. 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఫలితంగా పేట్రియట్స్ 118 పరుగులకే కుప్పకూలగా, ట్రైడెంట్స్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

17 బంతుల్లో 0 పరుగులు, 4 వికెట్లు.. ఇలాంటోడు ఒక్కడుంటే చాలు భయ్యా..!
Chris Green Takes 4 Wickets
Venkata Chari
|

Updated on: Sep 12, 2026 | 6:30 AM

Share

Chris Green 300th T20: సీపీఎల్ (CPL) 2026లో బార్బడోస్ ట్రైడెంట్స్ కీలక విజయాన్ని అందుకుంది. సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ క్రిస్ గ్రీన్ తన 300వ టీ20 మ్యాచ్‌ను ఘనంగా గుర్తుండిపోయేలా చేశాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన గ్రీన్.. 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అతని బౌలింగ్ ధాటికి పేట్రియట్స్ 118 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ట్రైడెంట్స్ 18 ఓవర్లలో 120 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

గ్రీన్ స్పిన్ మాయాజాలం..

సీపీఎల్ 2026లో బార్బడోస్ ట్రైడెంట్స్ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. బ్రిడ్జ్‌టౌన్‌లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో ప్రధాన పాత్ర కెప్టెన్ క్రిస్ గ్రీన్‌దే. తన 300వ టీ20 మ్యాచ్ ఆడుతున్న గ్రీన్ బౌలింగ్‌ను తానే ప్రారంభించి, తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

ఇవి కూడా చదవండి

11 ఓవర్లకే పేట్రియట్స్ కుదేలు..

గ్రీన్ దూకుడుతో పేట్రియట్స్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇందులో గ్రీన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో 17 బంతులు డాట్ బాల్స్‌గా నిలిచాయి. మిగిలిన ఏడు బంతుల్లో 20 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో పేట్రియట్స్ 118 పరుగులకే ఆలౌటైంది.

హసరంగ పోరాటం వృథా..

పేట్రియట్స్ ఇన్నింగ్స్‌లో వానిందు హసరంగ మాత్రమే దూకుడుగా ఆడాడు. అతను 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అయినప్పటికీ గ్రీన్ బౌలింగ్‌కు సరైన సమాధానం దొరకకపోవడంతో జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

డికాక్ నిలబెట్టాడు..

119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రైడెంట్స్‌కు కూడా ఆరంభం సులభంగా సాగలేదు. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే అనుభవజ్ఞుడైన దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఇతర బ్యాటర్లతో కలిసి చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ లక్ష్యాన్ని చేరువ చేశాడు. చివరకు 18 ఓవర్లలో ట్రైడెంట్స్ 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఈ గెలుపుతో ట్రైడెంట్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించి ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. దీంతో సీపీఎల్ ప్లేఆఫ్స్ (CPL Playoffs) రేసులోకి తిరిగి వచ్చింది. మరోవైపు పేట్రియట్స్ పదో మ్యాచ్‌లో ఆరో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us