WPL 2026 Auction: డేంజరస్ ప్లేయర్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. మెగా వేలం తర్వాత ఏ జట్టులో ఎంతమంది చేరారంటే..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలంలో, అత్యంత ముఖ్యమైన మార్క్యూ ప్లేయర్ల సెట్ అంచనాలను మించిపోయింది. దీప్తి శర్మ, అమేలియా కెర్ వంటి ఆల్-రౌండర్‌లకు భారీ ధరలు పలకగా, అనుభవజ్ఞులైన కొందరు ఆటగాళ్లను 'రైట్ టు మ్యాచ్' (RTM) ద్వారా వారి పాత జట్లే తిరిగి దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ అమ్ముడుపోకపోవడం ఈ వేలంలో పెద్ద షాక్‌గా నిలిచింది.

WPL 2026 Auction: డేంజరస్ ప్లేయర్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. మెగా వేలం తర్వాత ఏ జట్టులో ఎంతమంది చేరారంటే..?
Wpl 2026 Auction

Updated on: Nov 28, 2025 | 6:21 AM

WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం (WPL 2026 mega auction) పూర్తయింది. ఈ వేలంలో 23 మంది విదేశీ ప్లేయర్లతో కలిపి మొత్తం 67 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు తమ జట్లలో భాగం చేసుకున్నాయి. ఈ ప్లేయర్ల కోసం రూ.40.8 కోట్లు ఖర్చు చేశాయి. అయితే, టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అత్యధిక ప్రైజ్ దక్కించుకుంది. యూపీ వారియర్స్ టీం ఏకంగా రూ. 3.20 కోట్లతో ఆర్‌టీఎం కార్డుతో దక్కించుకుంది. కివీస్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను రూ.3 కోట్లకు ముంబయి దక్కించుకోగా, టీమిండియా మరో ఆల్‌రౌండర్ శిఖా పాండేను యూపీ వారియర్స్ రూ.2.40 కోట్ల దక్కించుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు తీసుకుంది. ఈ మెగా వేలం పూర్తవ్వడంతో ఏ జట్టు ఎవరిని? ఎంతకు దక్కించుకుందో ఓసారి చూద్దాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, శ్రేయంక పాటిల్ రిటైన్ అయ్యారు. జార్జియా వోల్ (రూ.60 లక్షలు), నాడిన్ డి క్లెర్క్ (రూ.65 లక్షలు), రాధా యాదవ్ (రూ.65 లక్షలు), లారెన్ బెల్ (రూ.90 లక్షలు), లిన్సే స్మిత్ (రూ.30 లక్షలు), ప్రేమ రావత్ (రూ.20 లక్షలు.. ఆర్‌టీఎం), అరుంధతీ రెడ్డి (రూ.75 లక్షలు), పూజా వస్త్రాకర్ (రూ.85 లక్షలు), గ్రేస్ హారిస్ (రూ.75 లక్షలు), గౌతమి నాయక్ (రూ.10 లక్షలు), ప్రత్యూష కుమార్ (రూ.10 లక్షలు), దయాళన్ హేమలత (రూ.30 లక్షలు).

ముంబయి ఇండియన్స్: అమన్‌జోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, జి కమలిని రిటైన్‌ అయ్యారు. అమేలియా కెర్ (రూ.3 కోట్లు), షబ్నమ్ ఇస్మాయిల్ (రూ.60 లక్షలు), సంస్కృతి గుప్తా (రూ.20 లక్షలు), సజీవన్ సజన (రూ. 75 లక్షలు), రహీలా(రూ.10 లక్షలు), నికోలా కారి (రూ.30 లక్షలు), త్రివేణి వశిష్ట (రూ.20 లక్షలు), నల్లా రెడ్డి (రూ.10 లక్షలు), సైకా ఇషాక్ (రూ.30 లక్షలు), మిలీ ఇల్లింగ్‌వర్త్ (రూ. 10 లక్షలు).

ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, మారిజెన్ కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నిక్కీ ప్రసాద్ రిటైన్ అయ్యారు. లారా వోల్వార్ట్ (రూ.1.10 కోట్లు), చినెల్లే హెన్రీ (రూ.1.30 కోట్లు), శ్రీ చరణి (రూ.1.30 కోట్లు), స్నేహ్‌ రాణా (రూ.50 లక్షలు), లిజెల్ లీ (రూ.30 లక్షలు), దీయా యాదవ్ (రూ.10 లక్షలు), తనియా భాటియా (రూ.30 లక్షలు), మమత మడివాలా (రూ.10 లక్షలు), నందినీ శర్మ (రూ.10 లక్షలు), హామిల్టన్ (రూ.10 లక్షలు), మిన్ను మణి (రూ.40 లక్షలు).

యూపీ వారియర్స్: శ్వేతా సెహ్రావత్ రిటైన్ అయింది. దీప్తి శర్మ (రూ.3.2 కోట్లు ఆర్‌టీఎం), సోఫీ ఎకిల్‌స్టోన్ (రూ.85 లక్షలు), మెగ్ లానింగ్ (రూ.1.90 కోట్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రూ.1.20 కోట్లు), కిరణ్ నవ్‌గిరే (రూ.60 లక్షలు), హర్లీన్ డియోల్ (రూ. 50 లక్షలు), క్రాంతి గౌడ్‌ (₹ 50 లక్షలు ఆర్‌టీఎం), ఆశా శోభన (రూ.1.10 కోట్లు), డియాండ్రా డాటిన్ రూ.80 లక్షలు), శిఖా పాండే (రూ.2.40 కోట్లు), సిమ్రాన్ షేక్ (రూ.10 లక్షలు), షిప్రా గిరి (రూ.10 లక్షలు), క్లో ట్రయాన్ (రూ.30 లక్షలు), సుమన్ మీనా (రూ.10 లక్షలు), గొంగడి త్రిష (రూ.10 లక్షలు), ప్రతీకా రావల్ (రూ.40 లక్షలు), తారా నోరిస్ (రూ.10 లక్షలు).

గుజరాత్ జెయింట్స్: ఆష్లీగ్ గార్డ్‌నర్, బెత్ మూనీ రిటైన్ అయ్యారు. సోఫీ డివైన్ (రూ.2 కోట్లు), రేణుకా సింగ్ (రూ.60 లక్షలు), భారతి ఫుల్మాలి (రూ.70 లక్షలు), టిటాస్ సాధు (రూ.30 లక్షలు), కష్వీ గౌతమ్ (రూ.75 లక్షలు ఆర్‌టీఎం), కనికా అహుజా (రూ.30 లక్షలు), తనుజా కన్వర్ (రూ. 45 లక్షలు), జార్జియా వేర్‌హమ్ (రూ.కోటి), అనుష్క శర్మ (రూ.45 లక్షలు), హ్యాపీ కుమారి (రూ.10 లక్షలు), కిమ్ గార్త్ (రూ.50 లక్షలు), యాస్తికా భాటియా (రూ.50 లక్షలు), డాని వ్యాట్ హాడ్జ్ (రూ.50 లక్షలు), ఆయుషి సోనీ (రూ.30 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (రూ.40 లక్షలు), శివాని సింగ్ (రూ.10 లక్షలు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..