ట్యాలెంట్‌లో సచిన్, పాంటింగ్ కన్నా తోపు.. అలాంటోకి అన్యాయం చేస్తారా..!

Glenn Maxwell Comments on Brad Hodge: బ్రాడ్ హాడ్జ్‌ను ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యంత అండర్‌రేటెడ్ ఆటగాళ్లలో ఒకరిగా పేర్కొన్నాడు. కేవలం ఆరు టెస్టులు ఆడిన హాడ్జ్‌కు మరిన్ని అవకాశాలు దక్కాల్సిందని మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. అతడి టెస్టు, ఫస్ట్‌క్లాస్ గణాంకాలు కూడా విశేషంగా ఉన్నాయి.

ట్యాలెంట్‌లో సచిన్, పాంటింగ్ కన్నా తోపు.. అలాంటోకి అన్యాయం చేస్తారా..!
Glenn Maxwell Comments On Brad Hodge

Updated on: Sep 05, 2026 | 11:10 AM

Glenn Maxwell Comments on Brad Hodge: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ తన కెరీర్‌లో మరిన్ని టెస్టులు ఆడాల్సిన ఆటగాడని ఆ దేశ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ‘Keeping it Cricket’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మ్యాక్స్‌వెల్.. తన దృష్టిలో ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత అండర్‌రేటెడ్ క్రికెటర్లలో హాడ్జ్ ఒకరని పేర్కొన్నాడు. విక్టోరియాకు చెందిన హాడ్జ్‌ను తాను చిన్నతనం నుంచే అభిమానించానని, అతడి పోస్టర్లు తన గదిలో ఉండేవని కూడా గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లతో నిండిన కాలంలో హాడ్జ్‌కు జట్టులో స్థిరమైన అవకాశం దక్కలేదని మ్యాక్స్‌వెల్ వివరించాడు.

ఆడింది ఆరు టెస్టులే..

బ్రాడ్ హాడ్జ్ ఆస్ట్రేలియా తరపున కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 503 పరుగులు చేసి 55.88 సగటు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీతోపాటు రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై పెర్త్‌లో 203 నాటౌట్ అతడి అత్యుత్తమ టెస్టు స్కోరు.

ఎక్కువమంది చదివినది: 27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!

ఇవి కూడా చదవండి

హాడ్జ్ కెరీర్ సాగిన సమయంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, మైకేల్ హస్సీ, జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో మంచి పరుగులు చేసినప్పటికీ జాతీయ జట్టులో హాడ్జ్‌కు అవకాశాలు పరిమితమయ్యాయి.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో హాడ్జ్ రికార్డు మాత్రం అతడి ప్రతిభను స్పష్టంగా చూపిస్తుంది. 223 మ్యాచ్‌ల్లో 17,084 పరుగులు, 48.81 సగటుతో పాటు 51 సెంచరీలు, 64 అర్ధసెంచరీలు సాధించాడు. 302 నాటౌట్ అతడి అత్యధిక స్కోరు.

ఎక్కువమంది చదివినది: Vaibhav Sooryavanshi: ఫైనల్ మ్యాచ్ ఆడొద్దు.. వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన గంభీర్..?

మ్యాక్స్‌వెల్ మరో ఆటగాడి గురించి కూడా ప్రస్తావించాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ తనను ఆకట్టుకున్నాడని చెప్పాడు. ముఖ్యంగా అతడి బంతిని బలంగా కొట్టే సామర్థ్యం తనకు నచ్చిందని వివరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us