Virat Kohli: కోహ్లీపై సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేశారా.. వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పిస్తారా.. క్లారీటీ ఇచ్చిన BCCI..

|

Sep 30, 2021 | 1:08 PM

టీమిండియా టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి భారత జట్టుపై రూమార్స్ వస్తున్నాయి...

Virat Kohli: కోహ్లీపై సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేశారా.. వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పిస్తారా.. క్లారీటీ ఇచ్చిన BCCI..
Virat Kohli
Follow us on

టీమిండియా టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి భారత జట్టుపై రూమార్స్ వస్తున్నాయి. జట్టులో భేదాభిప్రాయాల వల్ల కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి తర్వాత కోహ్లీపై వైస్ కెప్టెన్ అజిక్య రహానే, చటేశ్వర పుజారా, రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారని వార్త కథనాలు వచ్చాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కోహ్లీని త్వరలో వన్డే కెప్టెన్సీని తీసివేయవచ్చని పుకార్లు కూడా వచ్చాయి. ఈ వార్త కథనాలు, పుకార్లకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ బుధవారం ముగింపు పలికారు. అతను ఓ వార్త సంస్థతో మాట్లాడారు.

మీడియా అనవసర కథనాలు రాస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఏ ఆటగాడు కూడా బీసీసీఐకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ప్రతిదానికి బీసీసీఐ సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రపంచ కప్ భారత జట్టులో మార్పులు ఉంటాయని కొన్ని వార్తలు వస్తున్నాయని.. ఇది తప్పని.. మార్పులు ఉన్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కోహ్లీపై మొదటగా అశ్విన్ వెళ్లి బీసీసీఐ ఉన్నతాధికారులతో మాట్లాడారని.. తర్వాత రహానే, పుజారా ఇదే విషయంపై ఫిర్యాదు చేసినట్లు వస్తున్న కథనాలను ఆయన గట్టిగా ఖండించారు. కొద్ది రోజుల క్రితం కోహ్లీ కెప్టెన్సీపై బోర్డ్ సెక్రటరీ జయ్ షా ఆటగాళ్ల అభిప్రాయాలు కోరారని.. కోహ్లీ కెప్టెన్సీ పట్ల చాలా మంది సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారనే పుకార్లు వచ్చాయని చెప్పారు. ఇలాంటివి భారత క్రికెట్‎కు మంచిది కాదని ధుమాల్ చెప్పారు.

భారత జట్టుపై వచ్చే నిరాధార వార్తలను నమ్మొద్దని ఆయిన చెప్పారు. అధికారికంగా ప్రటిస్తేనే వార్తలు రాయాలని కోరారు. మరోవైపు ఐపీఎల్-2021 ముగిసిన వెంటనే కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుండి వైదొలగుతానని ప్రకటించాడు. కోహ్లీ యూఏఈ, ఒమన్‎లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు చివరిసారిగా కెప్టెన్‎గా వ్యవహరించనున్నాడు.