IPL 2023: అప్పుడు పృథ్వీ షా.. ఇప్పుడు జైస్వాల్.. ఒక్క ట్వీట్‌తో టీమిండియాలోకి ఎంట్రీనా.!!

|

May 12, 2023 | 9:01 PM

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ 21 ఏళ్ల ఓపెనర్ కోల్‌కతాతో...

IPL 2023: అప్పుడు పృథ్వీ షా.. ఇప్పుడు జైస్వాల్.. ఒక్క ట్వీట్‌తో టీమిండియాలోకి ఎంట్రీనా.!!
Yashasvi Jaiswal
Follow us on

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ 21 ఏళ్ల ఓపెనర్ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే రికార్డు ఫిఫ్టీ సాధించి.. ఐపీఎల్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా జైస్వాల్ పేరే మారుమ్రోగుతోంది. ఈ బ్యాటర్‌ను టీమిండియా జట్టులోకి తీసుకోవాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.

మే 11న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 98 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు యశస్వి జైస్వాల్. ఈ ఇన్నింగ్స్ ప్రారంభంలో, యశస్వి మొదటి ఓవర్‌లోనే 26 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అతడు కేవలం 13 బంతుల్లో IPL చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తాను సెలెక్టర్‌గా ఉంటే, యశస్విని జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తానని చెప్పాడు. ఇక ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ట్విట్టర్ వేదికగా జైస్వాల్‌ను ప్రశంసించాడు. ‘తనకు ఆట మీద ఉన్న నిబద్దతను చూపించి.. అద్భుతమైన రికార్డు ఫిఫ్టీ సాధించాడు జైస్వాల్. భవిష్యత్తులో కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తాడని ఆశిస్తున్నా’ అని జైషా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా, చాలామంది భారతీయ యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. వారి గురించి జైషా ట్వీట్ చేయడం చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో జైస్వాల్‌ను అభినందిస్తూ షా ట్వీట్ చేయడంతో టీమిండియాలోకి యశస్వి ఎంట్రీ ఖాయమంటూ అభిమానులు కామెంట్స్‌ రూపంలో హోరెత్తిస్తున్నారు.

అప్పుడు పృథ్వీ షాకి కూడా ఇంతే..

జైషా ట్వీట్ అనంతరం అభిమానులు ఊహాగానాలు చేయడం వెనుక ఓ కారణం ఉంది. ఈ ఏడాది జనవరిలో, రంజీ ట్రోఫీలో పృథ్వీ షా అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించినప్పుడు, షా అతడ్ని మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇక అది చేసిన కొద్దిరోజుల్లో పృథ్వీ షాకు టీ20 జట్టులో అవకాశం దక్కింది.