BCCI Chief Selector: అజిత్ అగార్కర్ గుడ్‌బై ? చీఫ్ సెలక్టర్ రేసులో ఎవరెవరు?

BCCI: చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయనకు మరోసారి పొడిగింపు లభిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా నివేదికల ప్రకారం పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు తదుపరి చీఫ్ సెలక్టర్ రేసులో వినిపిస్తున్నాయి. అయితే అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ నుంచి తుది అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

BCCI Chief Selector: అజిత్ అగార్కర్ గుడ్‌బై ? చీఫ్ సెలక్టర్ రేసులో ఎవరెవరు?
Ajit Agarkar

Updated on: Sep 17, 2026 | 11:55 AM

BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అక్టోబర్ 4తో ఆయన పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని పొడగిస్తారా లేదా అనే దాని పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒకసారి పొడిగింపులో ఉన్న అగార్కర్‌ను ఇకపై కొనసాగించే అవకాశం లేదని క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని, కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఇప్పుడే ఎంపిక చేయడం సరైన నిర్ణయమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జరగనున్న బీసీసీఐ యాన్యువల్ జనరల్ మీటింగులో(AGM) దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

చివరి సెలక్షన్ మీటింగ్ ముగిసిందా?

వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్, ఇరానీ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమావేశమే అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో జరిగిన చివరి సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ సెలక్షన్ కమిటీ సమావేశంలోనే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను సెలక్ట్ చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి రాబోయే వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేరని సెలక్టర్లు భావించినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో రోహిత్ అద్భుతమైన సెంచరీ (138 పరుగులు) చేసి సెలక్టర్లకు తాను ఫిట్ గా ఉన్నారని గట్టి సమాధానం ఇచ్చారు. మరోవైపు రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. సెలక్టర్ల ప్రణాళికల్లో ఉన్నంత కాలం రోహిత్ దేశం తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు.

కొత్త చీఫ్ సెలక్టర్ రేసులో పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా

ఒకవేళ అజిత్ అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమిస్తే ఆ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఐపీఎల్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ప్రజ్ఞాన్ ఓఝా ఇప్పటికే సెలక్షన్ కమిటీలో మెంబర్‌గా ఉండటంతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోనూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, గుజరాత్‌కు చెందిన పార్థివ్ పటేల్ వివిధ ఐపీఎల్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం కలిగి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి చీఫ్ సెలక్టర్ పగ్గాలు దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us