BCCI: ఐపీఎల్ వేలానికి ముందు ఊహించని షాక్.. ఆ బౌలర్లపై బీసీసీఐ నిషేధం.. అందుల్లో ఓ స్టార్ ప్లేయర్ కూడా..

|

Nov 23, 2024 | 7:07 AM

అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా 5 మంది ఆటగాళ్లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ భారీ యాక్షన్ తీసుకుంది. ఇద్దరు ఆటగాళ్లను బౌలింగ్ చేయకుండా బీసీసీఐ నిషేధించింది. దీంతో ముగ్గురు ఆటగాళ్లు ప్రమాదంలో పడ్డారు. ఈ ఆటగాళ్లందరూ IPL 2025 మెగా వేలం కోసం షార్ట్‌లిస్ట్ అయ్యారు.

BCCI: ఐపీఎల్ వేలానికి ముందు ఊహించని షాక్.. ఆ బౌలర్లపై బీసీసీఐ నిషేధం.. అందుల్లో ఓ స్టార్ ప్లేయర్ కూడా..
Bcci Banned 5 Bowlers For Suspect Bowling Action
Follow us on

IPL 2025 మెగా వేలానికి ముందు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పెద్ద చర్య తీసుకుంది. అనుమానాస్పద చర్యలతో కూడిన బౌలర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. కొందరు ఆటగాళ్లను బౌలింగ్ చేయకుండా నిషేధించింది. ఇంకా ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం పడే ప్రమాదం అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. BCCI ఈ బౌలర్ల బౌలింగ్ యాక్షన్‌పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం. ఈ ఐదుగురు ఆటగాళ్లు మెగా వేలంలో ఉండడంతో, వేలానికి ముందే వారికి పెద్ద షాక్ తగిలింది.

ఈ ఆటగాళ్లపై బీసీసీఐ నిషేదం

భారత క్రికెట్ జట్టుకు ఆడిన మనీష్ పాండే బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉంది. దీంతోొ మనీష్ పాండే బౌలింగ్‌ను నిషేధించారు.  శ్రీజిత్ కృష్ణన్  బౌలింగ్‌పై బీసీసీఐ నిషేధం కూడా విధించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో భాగంగా ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల చర్యకు సంబంధించి ఇంతకుముందు కూడా ప్రశ్నలు తలెత్తాయి. శ్రీజిత్ కృష్ణన్‌ను కూడా BCCI నిషేధించింది. మరోవైపు టీమ్ ఇండియా ఆటగాళ్లు దీపక్ హుడా, సౌరభ్ దూబే, కేసీ కరియప్ప అనుమానాస్పద చర్యల జాబితాలోకి చేరారు.అంటే.. ఈ ఆటగాళ్లపై ప్రస్తుతం నిషేధం లేదు. అయితే ఈ ఆటగాళ్లపై నిషేధం పడే ప్రమాదం ఉంది. దీపక్ హుడా బ్యాట్స్‌మెన్‌తో పాటు ఆఫ్‌స్పిన్నర్. మెగా వేలంలో డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో అతను ఒకడు. కానీ వేలానికి ముందు అతనికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇది వేలంలో దీపక్ హుడాకు నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు.

ఆ ప్లేయర్ల బేస్ ధర ఎంతంటే?

ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ హుడా తన బేస్ ధరను రూ.75 లక్షలుగా ఉంచుకున్నాడు. అతను గత సీజన్‌లో లక్నో జట్టులో సభ్యుడు. మనీష్ పాండే కూడా తన బేస్ ధరను రూ. 75 లక్షలుగా ఉంచుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 7 జట్ల తరఫున ఆడాడు. వీరితో పాటు శ్రీజిత్ కృష్ణన్, సౌరభ్ దూబే, కెసి కరియప్ప అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఈ వేలంలోకి ప్రవేశించనున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్ల బేస్ ధర రూ.30 లక్షలు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి