WTC Final 2023: భారత జట్టులోకి ఆటో డ్రైవర్ కొడుకు.. ఆర్మీ లవర్ నుంచి క్రికెటర్‌గా.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో స్థానం దక్కేనా..!

|

Jun 04, 2023 | 10:48 AM

WTC Final 2023 IND vs AUS: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. లండన్ ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్ల ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లో

WTC Final 2023: భారత జట్టులోకి ఆటో డ్రైవర్ కొడుకు.. ఆర్మీ లవర్ నుంచి క్రికెటర్‌గా.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో స్థానం దక్కేనా..!
Mukesh Kumar; WTC Final 2023 IND vs AUS
Follow us on

WTC Final 2023 IND vs AUS: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య  జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. లండన్ ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్ల ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లో మునిగిపోయారు. అయితే భారత్ తరఫున టెస్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన స్క్వాడ్‌లో ఓ ఆటో డ్రైవర్ కొడుకు కూడా ఉన్నాడు. అవును, ఇటీవల ఐపీఎల్‌ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ముకేష్ కుమార్ ఓ ఆటో డ్రైవర్ కుమారుడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో 10 మ్యాచ్‌లో ఆడిన ముకేష్ 7 వికెట్లు తీశాడు. మొత్తంగా తన టీ20 కెరీర్‌లో 23 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇటీవల ప్రకటించిన జట్టుకు ముకేష్ కూడా ఎంపికయ్యాడు. అయితే ఈ ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఇంకా రాలేదు.

ఆటోడ్రైవర్ కొడుకు నుంచి టీమ్ ఇండియా ప్లేయర్‌గా..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్టర్లు.. ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌ను జట్టుతో స్టాండ్‌బై ప్లేయర్‌గా ఇంగ్లాండ్‌కు పంపారు. అంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ప్రధాన జట్టులోని ఎవరైనా ఆటగాడు గాయపడినట్లయితే, అతను ఆడే అవకాశం పొందవచ్చు. ఇదిలా ఉండగా బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన ముఖేష్‌కుమార్‌ తండ్రి ఆటో నడుపుతూ గతేడాది చనిపోయాడు. మొదటి నుంచి ముఖేష్ క్రికెట్ ఆడటంలో ప్రావీణ్యం ఉన్నా.. బీహార్ నుంచి ఏ జట్టు కూడా రంజీలో భాగం కానందున అతనికి ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎంచుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే కష్టపడి బెంగాల్ జట్టులో స్థానం సంపాదించి దేశవాళీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఆ తర్వాత, ముఖేష్ ఇండియా-ఎ జట్టులో చోటు సంపాదించాడు. అలా ముఖేష్ కుమార్ జీవితం పోరాటాలతో నిండిపోయిందని చెప్పుకోవాలి. కానీ ముకేష్ తన కృషి, పట్టుదల, పోరాటం కారణంగా.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి టీమిండియా ప్లేయర్ స్థాయికి ఎదిగాడు.

ఆర్మీకి సెలెక్ట్ కాకపోవడమే కారణమా..

క్రికెట్‌లోకి రాకముందు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నాడు ముఖేష్. అయితే ఇందుకోసం మూడుసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. బహుశా అతని విధిలో మరేదైనా రాసి ఉందేమో కదా. పేదరికంలో పెరిగిన ముఖేష్.. ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ తరఫున ఆడుతున్నాడు. ఇక బంగ్లాదేశ్-ఎతో గత ఏడాది జరిగిన సిరీస్‌లో ముఖేష్ కుమార్ ఇండియా ఎ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లో అతను 2 మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు తీశాడు. ఇంకా ముఖేష్ కుమార్ ఇప్పటి వరకు 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 149 వికెట్లు తీశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో కూడా 24 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌..

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే చివరిసారిగా ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అదేకాక 2013 నుంచి టీమిండియా ఒక్క ICC టోర్నీని కూడా గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫైనల్ టీమ్ ఇండియాకు చాలా కీలకం కానుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ జయదేవ్ ఉనద్కత్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..