
పెద్దగా సంచలనం ఏం జరగలేదు.. అంతా అనుకున్నదే అయింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలిచేసింది. క్రికెట్ చరిత్రలో ఇంకా ఒక్క వన్డే, టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయిన టీమ్స్ చాలా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన జట్లు కూడా ఐసీసీ కప్పులను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి. అలాంటిది ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ మాత్రం.. మంచినీళ్లు తాగినంత సులభంగా ఐసీసీ ట్రోఫీలు గెలిచేస్తున్నారు. అసలు వారి సక్సెస్ వెనుకు వారి అద్భుతమైన ఆటా? లేక మిగతా జట్ల వైఫల్యమా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా.. మెన్స్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా డామినేషన్ తగ్గినప్పటికీ.. ఉమెన్స్ క్రికెట్‌లో మాత్రం వాళ్లకు తిరుగులేకుండా పోయింది.
ఐసీసీ కప్పులు గెలవడం ఒక అలవాటుగా మార్చుకున్న ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ గెలుపుతో టీమ్ మొత్తం 14 ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఘనతను అందుకుంది. ఇందులో 7 వన్డే ప్రపంచకప్‌లు, 7 టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో ఇంతటి విజయవంతమైన జట్టు మరొకటి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
1978లో తొలి టైటిల్ గెలిచిన ఆ జట్టు, ఆ తర్వాత 1982, 1988, 1997, 2005, 2013, 2022లోనూ విజేతగా నిలిచి మొత్తం ఏడు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రపంచ మహిళల వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా అదే జోరు కొనసాగించింది. 2010లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టు, 2012, 2014, 2018, 2020, 2023, తాజాగా 2026లోనూ టైటిల్ సాధించి ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు టీ20 ప్రపంచకప్‌లు గెలవడం వారి డామినేషన్‌కు నిదర్శనం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి