Nathan Lyon: లేటు వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు.. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి..

Nathan Lyon Wedding: ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ (Nathan Lyon) రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్‌ ఎమ్మా మెక్‌కార్తీ (Emma McCarthy) తో కలిసి తాజాగా పెళ్లిపీటలెక్కాడు. ఆదివారం సాయంత్రం ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు...

Nathan Lyon: లేటు వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు.. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి..
Nathan Lyon

Updated on: Jul 24, 2022 | 9:54 PM

Nathan Lyon Wedding: ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ (Nathan Lyon) రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్‌ ఎమ్మా మెక్‌కార్తీ (Emma McCarthy) తో కలిసి తాజాగా పెళ్లిపీటలెక్కాడు. ఆదివారం సాయంత్రం ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను నాథన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు లియాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నాథన్‌ వయసు 34 ఏళ్లు.

మొదటి భార్యతో విడిపోయి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే నాథన్‌కు ఇదివరకే మెల్‌ వారింగ్‌తో వివాహమైంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఐదేళ్ల క్రితమే విడిపోయారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మెల్‌తో విడిపోయిన వెంటనే ఎమ్మాతో ప్రేమలో పడ్డాడీ స్పిన్‌ మాంత్రికుడు. గతేడాది డైమండ్‌ రింగ్ తొడిగి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు అందరి ఆశీర్వాదంతో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కాడు. ఇక ఆఫ్‌స్పిన్నర్‌గా బంతిని గిరగిరాలు తిప్పే నాథన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్‌ క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లోనూ సత్తాచాటి 438వ వికెట్‌ను ఖాతాలో చేసుకున్నాడు. తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2011లో శ్రీలంకతో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాథన్‌ మొత్తం 110 టెస్టుల్లో 438 వికెట్లు పడగొట్టాడు. అలాగే 29 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో లియాన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో షేన్‌ వార్న్‌ (708 వికెట్లు), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563 వికెట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us