Video: నగ్నంగా స్టేడియం చుట్టూ తిరిగే ఛాన్స్ మిస్.. రూట్ సెంచరీపై హేడెన్ ఫన్నీ కామెంట్స్..

AUS vs ENG: జో రూట్ సాధించిన ఈ శతకం టెస్ట్ క్రికెట్‌లో అతనికి 40వ సెంచరీ. ఆస్ట్రేలియాలో 13 సంవత్సరాల నిరీక్షణకు ఇది తెరదించింది. రూట్ సెంచరీతో, ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టమైన స్థితికి చేరుకోగలిగింది. తొలిరోజు ముగసే సరికి ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.

Video: నగ్నంగా స్టేడియం చుట్టూ తిరిగే ఛాన్స్ మిస్.. రూట్ సెంచరీపై హేడెన్ ఫన్నీ కామెంట్స్..
Joe Root, Matthew Hayden

Updated on: Dec 05, 2025 | 8:49 AM

Joe Root and Matthew Hayden: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ చివరకు ఆస్ట్రేలియా గడ్డపై తన టెస్ట్ సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాబాలో జరిగిన రెండో టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్) మొదటి రోజున ఆయన అద్భుతమైన శతకాన్ని నమోదు చేశారు. ఈ సెంచరీ కేవలం రూట్‌కు, ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్కు కూడా గొప్ప ఊరటనిచ్చింది.

హేడెన్ సవాల్ ఏంటంటే..

యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు, మాథ్యూ హేడెన్ ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాలో జో రూట్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సెంచరీ కూడా చేయలేకపోవడంపై ఆయన స్పందిస్తూ, “ఈసారి యాషెస్ సిరీస్‌లో రూట్ కనుక సెంచరీ చేయకపోతే, నేను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) చుట్టూ బట్టలు లేకుండా (నగ్నంగా) పరుగెత్తుతాను” అని సవాలు విసిరారు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా గడ్డపై రూట్‌కు ఇది 16వ టెస్ట్ మ్యాచ్, 30వ ఇన్నింగ్స్. ఈ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రూట్ సెంచరీ సాధించడంతో, హేడెన్ తన సవాల్ నెరవేర్చాల్సిన అవసరం తప్పింది.

హేడెన్ స్పందన..


రూట్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే, కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాథ్యూ హేడెన్ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ తరువాత, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక వీడియోలో హేడెన్ రూట్‌ను అభినందిస్తూ ఇలా అన్నారు.. “గుడ్ డే, జో! ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించినందుకు అభినందనలు. నీకు ఇది కొంత సమయం పట్టింది. ఈ సెంచరీ కోసం నాకంటే ఎక్కువ ఆత్రుతగా ఎవరూ లేరు, నిజంగా..! నేను నీకు మంచి మనసుతో సెంచరీ రావాలని కోరుకున్నాను. కాబట్టి అభినందనలు, పది అర్ధ సెంచరీలు, చివరకు ఒక సెంచరీ. నువ్వు ఒక చిన్న రిప్పర్ మేట్. ఆనందించు” అంటూ చెప్పుకొచ్చాడు.

తన చమత్కారమైన సవాల్ గురించి మాట్లాడుతూ, ఈ శతకం వల్ల తన భార్య, కుమార్తె కూడా సంతోషించారని హేడెన్ అన్నారు, ఎందుకంటే వారు తాను నగ్నంగా పరుగెత్తడాన్ని చూడాలని అనుకోవడం లేదన్నారు.

రూట్ రికార్డ్..


జో రూట్ సాధించిన ఈ శతకం టెస్ట్ క్రికెట్‌లో అతనికి 40వ సెంచరీ. ఆస్ట్రేలియాలో 13 సంవత్సరాల నిరీక్షణకు ఇది తెరదించింది. రూట్ సెంచరీతో, ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టమైన స్థితికి చేరుకోగలిగింది. తొలిరోజు ముగసే సరికి ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..