David Warner: పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటన చేసిన వార్నర్ మామా.. చివరి మ్యాచ్ ఎప్పుడంటే?

David Warner Retirement After T20 World Cup 2024: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా, టీ20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక సాధకుల జాబితాలో డేవిడ్ వార్నర్ చేరాడు. ఈ ఘనత సాధించిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్నర్ ప్రకటించాడు. తాజాగా తొలి టీ20ఐ మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

David Warner: పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటన చేసిన వార్నర్ మామా.. చివరి మ్యాచ్ ఎప్పుడంటే?
David Warner Retairment
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:23 AM

David Warner Retirement After T20 World Cup 2024: వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఇప్పుడు టీ20 క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపాడు. అంతకంటే ముందు టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాలనుకుంటున్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తానని డేవిడ్ వార్నర్ తెలిపాడు. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ 2024లో ముగియడం ఖాయం.

ఆస్ట్రేలియా తరపున 100వ టీ20 మ్యాచ్‌ ఆడిన అనంతరం డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ.. వెస్టిండీస్‌తో జరిగిన ఈ ప్రదర్శన తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నా ముందు కేవలం ఒక నెల మాత్రమే ఉంది. కాబట్టి నేను ఈ ఫాంను కొనసాగించాలనుకుంటున్నాను. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను అని వార్నర్ తెలిపాడు.

37 ఏళ్ల వార్నర్ జనవరి 1న వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. జనవరి 6న తన చివరి మ్యాచ్‌ ఆడి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై కూడా చెప్పాడు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ రాబోయే టీ20 ప్రపంచకప్‌నకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌, నమీబియా, ఒమన్‌, స్కాట్‌లాండ్‌లతో కూడిన గ్రూప్‌ బిలో ఆస్ట్రేలియా ఉంది. ఈ జట్లపై ఆస్ట్రేలియా బలమైన ప్రదర్శన కనబరుస్తుందని భావిస్తున్నారు. మరి ఈ అంచనాలతో బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా జట్టు.. వార్నర్‌కు ప్రపంచకప్‌ విజయాన్ని అందజేస్తుందో లేదో వేచి చూడాలి.

జట్లు:

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (కీపర్), షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, జోష్ హాజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..