
India vs Australia, 2nd T20I: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారథి మ్యాథ్యూ వేడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా జట్టు 2 మార్పులు చేసింది. బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో మాక్స్‌వెల్ వచ్చారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో భారత్ నేడు బరిలోకి దిగుతుంది. అలాగే, ఆస్ట్రేలియా టీం పునరాగమనం చేసేందుకు బరలోకి దిగనుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాపై టీ20లో వరుసగా నాలుగో విజయం సాధించినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీ20లో భారత్‌కిది వరుసగా ఆరో విజయం. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడిపోలేదు.
టీ20 ఫార్మాట్‌లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 10 సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఐదింటిలో గెలుపొందగా, ఆస్ట్రేలియా రెండింటిలో విజయం సాధించింది.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..