Glenn Maxwell Double Hundred Record: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవడంలో గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) కీలక పాత్ర పోషించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ (AUS Vs AFG) తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ఇక్కడి నుంచి మాక్స్‌వెల్ 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ డబుల్ సెంచరీతో మ్యాక్స్‌వెల్ వరుస రికార్డులు సృష్టించాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే మ్యాచ్‌లో పరుగుల వేటలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకుముందు, 2021లో దక్షిణాఫ్రికాపై లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 193 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ వన్డే పరుగుల వేటలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2011 టోర్నమెంట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 158 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ ప్రపంచకప్‌లో పరుగులను ఛేజింగ్ చేస్తున్నప్పుడు అత్యధిక స్కోర్ చేసిన రికార్డు గతంలో ఉంది.
201* – గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) v ఆఫ్ఘనిస్తాన్, ముంబై, 2023 ప్రపంచ కప్
193 – ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) v దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2021
185* – షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) vs బంగ్లాదేశ్, మీర్పూర్, 2011
183* – MS ధోని (భారతదేశం) vs శ్రీలంక, జైపూర్, 2005
183 – విరాట్ కోహ్లీ (భారతదేశం) vs పాకిస్తాన్, మీర్పూర్, 2012
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఈ నంబర్‌పై డబుల్ సెంచరీ చేయడం ద్వారా, అతను భారత మాజీ వెటరన్ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. 1983లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కపిల్ దేవ్ 175* పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఇప్పుడు అతని అజేయమైన 201* పరుగులతో, ODIలో ఆరో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట నమోదైంది.
237* – మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) vs వెస్టిండీస్, వెల్లింగ్టన్, 2015
215 – క్రిస్ గేల్ (వెస్టిండీస్) vs జింబాబ్వే, కాన్‌బెర్రా, 2015
201* – గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) vs ఆఫ్ఘనిస్తాన్, ముంబై, 2023* ఈరోజు
188* – గ్యారీ కిర్‌స్టన్ (దక్షిణాఫ్రికా) v UAE, రావల్పిండి, 1996
183 – సౌరవ్ గంగూలీ (భారతదేశం) vs శ్రీలంక, టౌంటన్, 1999.
49 – క్రిస్ గేల్
45 – రోహిత్ శర్మ
43 – గ్లెన్ మాక్స్‌వెల్
37 – ఏబీడీ డివిలియర్స్
37 – డేవిడ్ వార్నర్.
210* – గ్లెన్ మాక్స్‌వెల్ vs ఆఫ్ఘనిస్తాన్, ముంబై, 2023 ప్రపంచ కప్
185* – షేన్ వాట్సన్ vs బంగ్లాదేశ్, మీర్పూర్, 2011
181* – మాథ్యూ హేడెన్ vs న్యూజిలాండ్, హామిల్టన్, 2007
179 – డేవిడ్ వార్నర్ vs పాకిస్తాన్, అడిలైడ్, 2017
178 – డేవిడ్ వార్నర్ vs ఆఫ్ఘనిస్తాన్, పెర్త్, 2015 ప్రపంచ కప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..