Anaya Bangar: మారింది రూపమే.. క్రికెట్‌పై ప్రేమ కాదు.. అమ్మాయిగా మారి మళ్లీ మైదానంలోకి స్టార్ క్రికెటర్

Anaya Bangar: మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ సంతానం అనాయా బంగార్‌కు ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. లింగమార్పిడి తర్వాత క్రికెట్‌కు దూరమైన ఆమెకు ఇది కొత్త అవకాశంగా మారింది. 2027 నుంచి ఎలైట్ క్రికెట్‌కు అర్హత సాధించేందుకు నిబంధనలు వర్తిస్తాయి. WBBLలో ఆడాలనే ఆశతో అనాయా ఫిట్‌నెస్, ఫామ్‌పై దృష్టి పెట్టనుంది.

Anaya Bangar: మారింది రూపమే.. క్రికెట్‌పై ప్రేమ కాదు.. అమ్మాయిగా మారి మళ్లీ మైదానంలోకి స్టార్ క్రికెటర్
Anaya Bangar

Updated on: Aug 26, 2026 | 9:18 AM

Anaya Bangar: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ సంతానం, లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా పురుషుడి నుంచి మహిళగా మారిన అనాయా బంగార్‌కు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. పక్కన పెట్టిన క్రికెట్ కల మళ్లీ చిగురించడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో ఇదొక అత్యంత కీలకమైన మైలురాయిగా అనాయా బంగార్ పేర్కొంది. లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇకపై క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం అసాధ్యమని భావించిన క్షణాలను ఆమె గుర్తుచేసుకుంది. ఆస్ట్రేలియా కమ్యూనిటీ క్రికెట్ నుంచి లభించిన ఈ అవకాశం తనకంతో కొత్త ఊపిరి పోసిందని సంతోషం వ్యక్తం చేసింది. మానసిక సంఘర్షణలను దాటుకుని మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆస్ట్రేలియా బోర్డు ఇచ్చిన అనుమతి ఎంతగానో ఉపయోగపడిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆడిన అనుభవం

అనాయా బంగార్ శస్త్రచికిత్సకు ముందు ఆర్యన్ బంగార్‌గా ఉన్న సమయంలో ముంబై లోకల్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచేది. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, అతని సోదరుడు ముషీర్ ఖాన్‌లతో కలిసి అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం అనాయాకు ఉంది. మైదానంలో మంచి మిత్రులుగా మెలిగిన వీరు క్లబ్ మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. పురుషుడిగా క్రికెట్ ఆడిన రోజుల్లో లభించిన అనుభవం ఇప్పుడు మహిళల క్రికెట్‌లో రాణించేందుకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: UP T20 League 2026: టీ20 లీగ్‌లో పరాకాష్టకు చేరిన ఉత్కంఠ.. రింకూ వికెట్ పడగొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్లేయర్

క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన నిబంధనలు ఇవే

ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లు మహిళల క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొన్ని కఠినమైన వైద్య నిబంధనలను నిర్దేశించింది. క్రీడాకారిణి శరీరంలో సీరమ్ టెస్టోస్టెరాన్ స్థాయిలు కనీసం 12 నెలల పాటు లీటరుకు 10 నానోమోల్స్ కంటే తక్కువగా ఉండాలి. ఈ వైద్య పరిమితులను విజయవంతంగా దాటిన తర్వాతే అనాయాకు ఆడే వెసులుబాటు లభించింది. బిగ్ బాష్ లీగ్ (BBL) వంటి దిగ్గజ టోర్నీల్లో ఆడాలన్నా ఈ వైద్య ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉండాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: Watch: జ్వరం భయం లేదట.. వర్షం చూస్తే ఆగలేడట! కొలంబోలో పంత్ ఫుల్ ఎంజాయ్‌మెంట్!

అంతర్జాతీయ మ్యాచ్‌లపై మాత్రం ఐసీసీ నిషేధం

ఆస్ట్రేలియాలోని స్థానిక లేదా కమ్యూనిటీ లీగ్‌లలో ఆడేందుకు మార్గం సుగమమైనప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అనాయా బంగార్ ఆడే అవకాశం లేకపోవడం గమనార్హం. లింగమార్పిడి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆడకూడదని ఐసీసీ ఇదివరకే స్పష్టమైన నిషేధం విధించింది. దీనివల్ల అనాయా ఆస్ట్రేలియా లోకల్ లీగ్స్‌కు మాత్రమే పరిమితం కానుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us