Akash Deep : అలాంటి వాడు దొరకడం చాలా అరుదు.. కష్టాల్లో ఉన్న కుటుంబానికి స్తంభంలా నిలిచిన ఆకాష్

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 10 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాష్ దీప్, తన ప్రదర్శనను క్యాన్సర్‌తో బాధపడుతున్న అక్కకు అంకితం చేశాడు. తండ్రి, అన్న మరణం తర్వాత కుటుంబాన్ని చూసుకుంటున్న ఆకాష్‌ పట్ల అక్క అఖండ జ్యోతి భావోద్వేగంగా మాట్లాడారు.

Akash Deep : అలాంటి వాడు దొరకడం చాలా అరుదు.. కష్టాల్లో ఉన్న కుటుంబానికి స్తంభంలా నిలిచిన ఆకాష్
Akash Deep

Updated on: Jul 07, 2025 | 5:31 PM

Akash Deep : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ ఆకాష్ దీప్ అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు 336 పరుగుల విజయాన్ని అందించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 10 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాష్, తన ఈ ప్రదర్శనను క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అక్క అఖండ జ్యోతికి అంకితం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాష్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. క్యాన్సర్‌ థర్డ్ స్టేజీతో పోరాడుతున్న ఆకాష్ అక్క అఖండ జ్యోతి, తన ఆరోగ్యం గురించి ఆకాష్ బహిరంగంగా మాట్లాడతారని ఊహించలేదని చెప్పింది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ఆకాష్ ఇలాంటి విషయం చెబుతాడని నాకు అస్సలు తెలియదు. బహుశా మేం ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటానికి రెడీగా లేం. కానీ అతను అంత ఎమోషనల్‌గా నా కోసం చెప్పడం, నాకు అంకితం చేయడం – ఇది చాలా పెద్ద విషయం. ఇది మా ఫ్యామిలీ పట్ల, నా పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నా, అలాంటి ప్రదర్శన చేసి వికెట్లు తీయడం చాలా గొప్ప విషయం” అని తెలిపింది.

ఆకాష్ ఎప్పుడూ ఆట పట్ల అంకితభావం చూపిస్తాడని అక్క అఖండ జ్యోతి చెప్పింది. ఆకాష్ తన విజయాన్ని ఇలా తనకు అకింతం చేసినందుకు గర్వపడుతున్నానని జ్యోతి తెలిపింది. తోబుట్టువులలో తను చిన్నవాడైనా ఫ్యామిలీ పట్ల చాలా శ్రద్ధ తీసుకునేవాడని ఆమె చెప్పుకొచ్చింది. రెండు నెలల క్రితం క్యాన్సర్ ఉందని తెలిసింది. ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజు తనను ఆస్పత్రిలో కలిసేందుకు ఆకాశ్ వచ్చేవాడని అఖండ జ్యోతి తెలిపింది. తను ఏ మ్యాచ్ కు వెళ్లే ముందు అయిన తల్లి దీవెనలు తీసుకుంటాడట.

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళే ముందు ఆకాష్‌ను కలిసినప్పుడు, తన క్రికెట్‌ కెరీర్ మీద దృష్టి పెట్టమని చెప్పానని జ్యోతి గుర్తు చేసుకుంది. జ్యోతి మాట్లాడుతూ.. ఇది భారతదేశానికి గర్వకారణం. అతను 10 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అతనిని ఎయిర్‌పోర్ట్‌లో కలవడానికి వెళ్ళాం.ఆరోగ్యం బాగానే ఉంది దేశం కోసం బాగా ఆడాలని సూచించినట్లు జ్యోతి చెప్పుకొచ్చారు. తన తమ్ముడు వికెట్లు తీసినప్పుడు కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని కూడా ఆమె చెప్పింది.

ఆకాష్ లక్నో ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే తన చికిత్స ప్రారంభమైందని జ్యోతి చెప్పింది. అతని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ, ఆసుపత్రిలో తనను కలిసేవాడు.టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత, ఆకాష్ జ్యోతికి రెండుసార్లు వీడియో కాల్ చేశాడ. ఆ క్షణం తనకు చాలా భావోద్వేగంగా ఉందని ఆమె వివరించింది. నాన్న, అన్నయ్య మరణం తర్వాత కుటుంబాన్ని కాపాడుతుంది ఆకాష్ అని జ్యోతి చెప్పింది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..