Big Bash League: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ క్యాచ్‌తో వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆడమ్ జంపా మాన్‌కాడింగ్‌తో మరోసారి చర్చల్లోకి వచ్చేసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. జనవరి 3 మంగళవారం నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మన్‌కడింగ్ వీడియో బయటకు వచ్చింది. మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ ఆడమ్ జంపా మాన్కడింగ్ చేయడంతో, బీబీఎల్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. అయితే అంపైర్ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకపోవడంతో, ఈ వివాదంపై విమర్శకుల నుంచి మాజీల వరకు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫీల్డింగ్ జట్టు బ్యాట్స్‌మన్ ఔట్ అయినట్లు తెలుస్తుంది. కానీ, అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌పై ఉంచడంతో, చివరకు నాటౌట్‌గా తేల్చాడు.
ఎంసీజీలో మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌లో ఈ సీన్ జరిగింది. స్టార్స్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను ఆడుతోంది. ఆడమ్ జంపా బౌలర్‌గా రంగంలో ఉన్నాడు. అతను ఐదవ బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ టామ్ రోజర్స్ నాన్ స్ట్రైక్ నుంచి పరుగు తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను బంతిని స్టంప్‌తో కొట్టాడు. అవుట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు.
వివాదాస్పదమైన అంపైర్ నిర్ణయం..
Spicy, spicy scenes at the MCG.
Not out is the call…debate away, friends! #BBL12 pic.twitter.com/N6FAjNwDO7
— KFC Big Bash League (@BBL) January 3, 2023
ఆడమ్ జంపా చర్యపై అంపైర్ బ్యాట్స్‌మన్ టామ్ రోజర్స్‌ను ఔట్‌గా ప్రకటించలేదు. థర్డ్ అంపైర్ నిర్ణయానికి ముందు వారికి అదే చెప్పాడు. మన్కడింగ్ పద్ధతిలో బ్యాట్స్‌మెన్‌ను ఎందుకు ఔట్ చేయలేదనే విషయం అంపైర్ అతనికి వివరించడం కూడా వీడియోలో చూడొచ్చు. మన్కడింగ్‌తో పెవిలియన్ చేరే పద్ధతి చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..