కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!

భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) టీ20 క్రికెట్‌లో మరో సంచలన రికార్డు సృష్టించాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అద్భుత శతకం బాదిన అభిషేక్.. విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును అధిగమించి 11 టీ20 సెంచరీలతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.

కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!
Ind Vs Nz 3rd T20i Abhishek Sharma Century Records

Updated on: Oct 27, 2026 | 3:30 PM

టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ పేరు మార్మోగుతోంది. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. భారత క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో భారత ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. దీంతో తన టీ20 కెరీర్‌లో సెంచరీల సంఖ్యను 11కు పెంచుకున్నాడు.

ఈ రికార్డుతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని అభిషేక్ వెనక్కి నెట్టాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ శర్మ 11 శతకాలతో భారత ఆటగాళ్ల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచాడు.

భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 సెంచరీలు

– 11 – అభిషేక్ శర్మ (Abhishek Sharma)*

– 10 – విరాట్ కోహ్లీ (Virat Kohli)

– 8 – సంజూ శాంసన్ (Sanju Samson)

– 8 – రోహిత్ శర్మ (Rohit Sharma)

– 8 – కేఎల్ రాహుల్ (KL Rahul)

ఇక ఈ జాబితాలో అభిషేక్ శర్మ సాధించిన ఘనత ప్రత్యేకమైనది. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లను అధిగమించి అత్యధిక టీ20 సెంచరీల రికార్డును తన పేరుతో నమోదు చేసుకోవడం అతడి దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనం.

ప్రత్యేకంగా న్యూజిలాండ్‌పై అతడి ఇన్నింగ్స్ మరో స్థాయిలో నిలిచింది. పవర్‌ప్లేలోనే భారీగా పరుగులు రాబట్టిన అభిషేక్.. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ 35 బంతుల్లో శతకం సాధించాడు. దీంతో భారత టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ కొత్త రికార్డు బుక్‌ను రాస్తున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us