World Cup 1983: కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ 1983లో తొలి ప్రపంచకప్ సాధించి 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనాటి టీంలోని సభ్యులతో ఓ ఛానెల్ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాంలో కపిల్స్ డెవిల్స్ సభ్యులు పాల్గొని, ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. మరోసారి టీమిండియా 2011లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను ఓడించి ఐసీసీ వన్డే ట్రోఫీని అందుకుంది. కపిల్ తర్వాత భారత్ కు ప్రపంచ కప్ అందించిన ఘనత ఎంఎస్ ధోనీకే దక్కుతుంది. అయితే, కపిల్ డెవిల్స్, ధోనీ టీంల మధ్య మ్యాచ్ నిర్వహిస్తే ఎవరు గెలుస్తారనే యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆనాటి లెజెండ్స్ మదన్‌లాల్, రోజర్ బిన్నీ సమాధానంగా “కచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పారు.
“మా జట్టులో సభ్యులంతా పోరాడే వారే. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకునే వాళ్లం కాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఆడేందుకు అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా మేమే గెలిచేవాళ్లం” అని మదన్‌లాల్ పేర్కొన్నారు. అలాగే రోజర్ బిన్నీ స్పందిస్తూ ‘ ధోనీ సేన, కపిల్ డెవిల్స్ ల మ్యాచ్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తే కచ్చితంగా మేమే గెలిచేవాళ్లం’ అని పేర్కొన్నారు. అనంతరం సందీప్ పాటిల్ మాట్లాడుతూ, తనకు ఇష్టమైన సందర్భాన్ని గుర్తు చేశారు. సెమీఫైనల్స్‌లో భారత్.. ఇంగ్లాండ్‌పై గెలవడం తనకు ఎంతో స్పెషల్ అని తెలిపాడు. ఆ రోజు తన తల్లి పుట్టినరోజని, ఆ మ్యాచ్ తాను 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచానని, విజయంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. భారత క్రికెట్‌లోనూ ఈ విజయం ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆనాటి జట్టు. ముఖ్యంగా కపిల్ ఆల్‌రౌండ్ బాధ్యతలతో టీం ను ముందుండి నడిపించి, ఎనలేని కీర్తిని పొందాడు. క్రికెట్‌ను అందరికీ పరిచయం చేసి, నేడు ప్రధాన క్రీడగా అవతరించడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. ఈమేరకు బీసీసీఐ కూడా శుక్రవారం ఆనాటి సంగతులను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. క్రికెట్ ప్రేమికులు కూడా కామెంట్లతో అలనాటి టీంను పొగడ్తలతో ముంచెత్తారు. కపిల్స్ డెవిల్స్ ఆఫ్ 1983 అంటూ సరదాగా ట్వీట్స్ పంచుకున్నారు.
Also Read:
Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం
Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం