IPL 2026 Auction: గత సీజన్‌లో ఛీకొట్టినా, రీఎంట్రీకి సిద్ధమైన కంగారోడు.. ఐపీఎల్ వేలానికి 1355 మంది రెడీ

IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి మొత్తం 1,355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, 31 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 77 మంది ఆటగాళ్లకు మాత్రం ఐపీఎల్ మినీ వేలంలో లక్కీ ఛాన్స్ దక్కనుంది.

IPL 2026 Auction: గత సీజన్‌లో ఛీకొట్టినా, రీఎంట్రీకి సిద్ధమైన కంగారోడు.. ఐపీఎల్ వేలానికి 1355 మంది రెడీ
Ipl 2026 Auction

Updated on: Dec 02, 2025 | 8:35 AM

IPL Mini- Auction 2026: ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం (Mini Auction) కోసం రంగం సిద్ధమైంది. ఈ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1355 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వేలం తేదీ, వేదిక: ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుధాబిలో జరగనుంది.

మొత్తం ఆటగాళ్లు: 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, ఇందులో ఎందరో స్టార్ క్రికెటర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాన ఆకర్షణలు..

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green), సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith), ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ (Jamie Smith) ఈ జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన కామెరాన్ గ్రీన్, ఈసారి వేలంలోకి భారీ అంచనాలతో వస్తున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రూ. 2 కోట్ల కనీస ధరతో (Base Price) తన పేరును నమోదు చేసుకున్నాడు.

గ్లెన్ మాక్స్‌వెల్ దూరం..

ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఈ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఆయన ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. భారత ఆటగాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే అత్యధిక కనీస ధర అయిన రూ. 2 కోట్ల విభాగంలో ఉన్నారు. వారిలో మాజీ కేకేఆర్ (KKR) స్టార్ వెంకటేశ్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఉన్నారు. అలాగే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి వంటి ప్రముఖ భారతీయ ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇది కూడా చదవండి: IND vs SA 2nd ODI: రాంచీలో చెత్త ఆట.. కట్‌చేస్తే.. 2వ వన్డే నుంచి ముగ్గురు ఔట్.. గంభీర్ కీలక నిర్ణయం..?

14 దేశాల నుంచి ఆటగాళ్ళు..

ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL Mini- Auction 2026) కోసం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, USA సహా వివిధ దేశాల నుంచి మొత్తం 14 మంది విదేశీ ఆటగాళ్ళు నమోదు చేసుకున్నారు. అదనంగా, భారత సంతతికి చెందిన మలేషియా క్రికెటర్ వీరన్‌దీప్ సింగ్ కూడా ప్రవేశం పొందాడు. కుడిచేతి వాటం మలేషియా ఆల్ రౌండర్ తన బేస్ ధరను రూ. 30 లక్షలుగా నిర్ణయించాడు.

అత్యధిక బేస్ ధర ఉన్న ఆటగాళ్లు..

ఐపీఎల్ (IPL 2026) మినీ వేలం కోసం రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్‌తో పాటు, రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న 43 మంది విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, షాన్ అబాట్, ఆష్టన్ అగర్, కూపర్ కొన్నోలీ, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, జాస్ ఇంగ్లిస్, ఇంగ్లాండ్‌కు చెందిన జామీ స్మిత్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కుర్రాన్, లియామ్ డాసన్, లియామ్ లివింగ్‌స్టన్, బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముజీబ్-ఉర్-రెహమాన్, నవీన్-ఉల్-హక్, న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, దక్షిణాఫ్రికాకు చెందిన జెరాల్డ్ కోట్జీ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే, శ్రీలంకకు చెందిన మహీష్ తీక్షణ, మతిషా పతిరానా, వనిందు హసరంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: IND vs SA: ప్రపంచ రికార్డులను పేకాటాడేసిన రోహిత్, కోహ్లి.. తొలి వన్డేలో బద్దలైన 10 రికార్డులు..

ఖాళీలు, బడ్జెట్..

మొత్తం 10 జట్లలో కలిపి 77 ఖాళీలు (31 విదేశీ స్లాట్లు) మాత్రమే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్ల పర్స్ (Purse) ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ. 43.4 కోట్లు ఉన్నాయి.

డిసెంబర్ 16న జరగబోయే ఈ వేలంలో ఫ్రాంచైజీలు ఎవరిని సొంతం చేసుకుంటాయో చూడాలి..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..