సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఓ అద్భుతమైన థాట్‌తో నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. అయితే గేమ్‌కు క్వాలిఫై అవ్వాలంటే శరీరంలోని టెస్టోస్టిరాన్ మోతాదు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల మేరకు ఉండాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని తెలుపుతూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు, లింగభేదం లేని ఆట అనే నినాదాలతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది.
కాగా ఈ వినూత్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోమని క్రికెట్ ఆస్ట్రేలియా కోరగా.. అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది వేచిచూడాలి.
Today we take a major step to ensure inclusiveness is at the heart of Australian Cricket.
Learn more about the inclusion of transgender and gender diverse people in the game: https://t.co/XbewXwazH4#ASportForAll pic.twitter.com/cRlM2TKx21
— Cricket Australia (@CricketAus) August 7, 2019