మల్లయోధులు..పెళ్లిపీటలెక్కనున్నారు!

|

Aug 09, 2019 | 3:42 AM

ప్రపంచ నంబర్‌ వన్‌ రెజ్లర్ బజరంగ్‌పునియా, విమెన్ రెజ్లర్ సంగీతాఫోగట్‌ త్వరలో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఇరువురి కుటుంబసభ్యులు దృవీకరించారు.  2020 టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత వీరి వివాహం  జరుగనుంది. ప్రస్తుతం రెజ్లింగ్‌లో భజరంగ్‌ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్‌ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. కాగా 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కుస్తీపోటీల్లో బంగారుపతక విజేత రెజ్లర్ గీతాఫోగట్‌, సంగీతాఫోగట్‌కు సోదరి. ఇద్దరు కూతుళ్లను అంతర్జాతీయ స్థాయిలో […]

మల్లయోధులు..పెళ్లిపీటలెక్కనున్నారు!
Follow us on

ప్రపంచ నంబర్‌ వన్‌ రెజ్లర్ బజరంగ్‌పునియా, విమెన్ రెజ్లర్ సంగీతాఫోగట్‌ త్వరలో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఇరువురి కుటుంబసభ్యులు దృవీకరించారు.  2020 టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత వీరి వివాహం  జరుగనుంది. ప్రస్తుతం రెజ్లింగ్‌లో భజరంగ్‌ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్‌ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. కాగా 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కుస్తీపోటీల్లో బంగారుపతక విజేత రెజ్లర్ గీతాఫోగట్‌, సంగీతాఫోగట్‌కు సోదరి. ఇద్దరు కూతుళ్లను అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్స్‌గా తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌సింగ్‌ జీవితం అధారంగానే అమీర్‌ఖాన్‌ లీడ్ రోల్ పోషించిన ‘దంగల్‌’ సినిమాను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.