గురి పెట్టారు.. గెలిచి చూపించారు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో అంకిత భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మొహోద్‌లతో కూడిన భారత జట్టు దక్షిణకొరియాను 4-2తో ఓడించి చారిత్రాత్మక గోల్డ్ సాధించింది. దీంతో అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ లను పలువురు అభినందించారు.

గురి పెట్టారు.. గెలిచి చూపించారు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం
Asian Games 2026

Updated on: Oct 02, 2026 | 7:42 AM

ఆసియా క్రీడల్లో భారత్‌ వరుస పతకాలతో సత్తా చాటుతోంది.. ఈ క్రమంలోనే.. భారత్‌కు మరో స్వర్ణం వరించింది.. మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని సాధించి భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఉదయం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో టైటిల్ ఫేవరెట్ అయిన దక్షిణ కొరియాను భారత్ 5-3 తేడాతో ఓడించింది. భారత జట్టులో అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ మొహమ్మద్ ఉండగా, కొరియా జట్టులో కాంగ్ చే-యంగ్, లీ యుంజి, ఓ యెజిన్ ఉన్నారు.

దీంతో భారతదేశం పతకాల సంఖ్య 67కి పెరిగింది.. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలు ఉన్నాయి.

ఉత్కంఠగా..

మొదటి రెండు సెట్లు సమంగా ముగిశాయి.. ఇరు జట్లు వరుసగా 54, 56 పాయింట్లు సాధించి పాయింట్లను పంచుకున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కాంగ్ ఉన్న కొరియా జట్టు, ఆ తర్వాత మూడవ సెట్‌లో తడబడింది. ఆ సెట్‌లో వరుసగా మూడు 8లు కొట్టి మొత్తం 52 స్కోరు సాధించగా, భారత ఆర్చర్లు 55 స్కోరు చేసి ఆ సెట్‌ను కైవసం చేసుకున్నారు.

నాలుగో సెట్‌లో కొరియా 54 పాయింట్లు సాధించింది. కీర్తి 8 పాయింట్లతో ప్రారంభించి, ఆ తర్వాత నిర్ణయాత్మకంగా దానిని 9 పాయింట్లకు మార్చడంతో, భారత్ మొత్తం పాయింట్లు 54కు చేరాయి. దీంతో స్కోరు సమం అయి, ఆ సెట్ డ్రాగా ముగియడంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

అంతకుముందు చైనాను 5-1 తేడాతో ఓడించిన భారత్, ఒకాజాకి చువో సోగో పార్క్‌లో దక్షిణ కొరియాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చైనా జట్టులో యెవీ హువాంగ్, క్వి యు, జింగీ జు ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us