Lionel Messi: జట్టుకు ‘బంగారు ఐఫోన్ల’ను గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ.. వాటి ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించిన చారిత్రాత్మక క్షణాలను గుర్తుచేసుకుంటూ లియోనాల్ మెస్సీ..  తన అర్జెంటీనా జట్టు సభ్యులు, సిబ్బందికి అదిరిపోయే బహుమతులు..

Lionel Messi: జట్టుకు ‘బంగారు ఐఫోన్ల’ను గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ.. వాటి ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Lionel Messi Gifts Golden Iphones To His World Cup Winning Team Of Argentina

Updated on: Mar 03, 2023 | 8:00 AM

ఖతర్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2023 టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచిన సంగతి తెలిసిందే. ఫలితంగా లియోనల్ మెస్సీ చిరకాల స్వప్నం కూడా తీరినట్లయింది. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచిన ఆ క్షణాలను మెస్సీ మరిచిపోవట్లేదు. ఆ చారిత్రాత్మక క్షణాలను గుర్తుచేసుకుంటూ లియోనాల్ మెస్సీ..  తన అర్జెంటీనా జట్టు సభ్యులు, సిబ్బందికి అదిరిపోయే కానుకలు ఇచ్చాడు. అవేమై ఉంటాయంటే దాదాపుగా అందరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవచ్చు. ఎందుకంటే మెస్సీ అనూహ్య రీతిలో బంగారు ఐఫోన్‌లను తన జట్టు సభ్యులకు, సిబ్బందికి బహుమతిగా ఇచ్చాడు. మొత్తం 35 బంగారు ఐఫోన్‌లను.. రూ.1.73 కోట్లు వెచ్చించి 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తన సహచరు ఆటగాళ్లు, సిబ్బందికి కానుకగా అందజేశాడు మెస్సీ.

గతేడాది డిసెంబరు ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు మెస్సీ. ఆ విజయాన్ని అందుకోవడంలో తనకు సహకరించిన వారందరికీ ఇలా ఈ అరుదైన కానుకలను అందజేసి మరోసారి తన అభిమానుల ఆదరాభిమానాలను పొందాడు ఈ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్. అయితే ఈ బంగారు ఐఫోన్‌ల కోసం మెస్సీ ఐడిజైన్ గోల్డ్ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్ వెనక భాగంగా సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, జెర్సీ నెంబర్, అర్జెంటీనా టీమ్ లోగో, వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్‌లను సదరు సంస్థ డెలివరీ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ ఫోన్ల ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా వీటిపై విశేషంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us