కోహ్లీని లైవ్ చాట్ లో ఆట‌ప‌ట్టించిన‌ అనుష్క శర్మ…

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో హ‌డావిడి చేస్తున్నాడు. ఇటీవ‌లే త‌న స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి క‌రోనాపై అభిమానులు అవ‌గాహ‌న క‌లిగే విధంగా వీడియోలు రిలీజ్ చేశాడు. తాజాగా పీఎం కేర్స్‌కు విరాళం అందజేయనున్నట్లు ప్రకటించి అంద‌రి అభిమానాన్ని చూర‌గొన్నాడు. ఇటీవ‌లి కాలంలో ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూలు చేయడం ప్రారంభించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. గ‌త […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:46 pm, Fri, 3 April 20
కోహ్లీని లైవ్ చాట్ లో ఆట‌ప‌ట్టించిన‌ అనుష్క శర్మ...

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో హ‌డావిడి చేస్తున్నాడు. ఇటీవ‌లే త‌న స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి క‌రోనాపై అభిమానులు అవ‌గాహ‌న క‌లిగే విధంగా వీడియోలు రిలీజ్ చేశాడు. తాజాగా పీఎం కేర్స్‌కు విరాళం అందజేయనున్నట్లు ప్రకటించి అంద‌రి అభిమానాన్ని చూర‌గొన్నాడు.

ఇటీవ‌లి కాలంలో ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూలు చేయడం ప్రారంభించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. గ‌త వారం రోహిత్ శ‌ర్మ‌తో అనేక విష‌యాలు ముచ్చ‌టించి..కొన్ని ఫ‌న్సీ క్వ‌చ్చ‌న్స్ తో అందరికి నవ్వు తెప్పించాడు. ఈ వీక్ భార‌త కెప్టెన్ కోహ్లీని టార్గెట్ చేశాడు కెవిన్. ఇన్‌స్టాగ్రామ్‌ ఇంటర్వ్యూలో కెరీర్, క్లిష్ట సమయాలు, టార్గెట్, ఆహార‌పు అల‌వాట్లు..మ‌రికొన్ని వ్యక్తిగత విషయాలపై కోహ్లీ, పీట‌ర్స‌న్ మ‌ధ్య‌ సీరియస్‌గా డిస్క‌ష‌న్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చింది భార‌త కెప్టెన్ భార్య అనుష్క శ‌ర్మ‌. ‘‘చలో.. చలో.. డిన్నర్ టైమ్’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేసి లైవ్‌చాట్‌లో కామెంట్‌ పెట్టింది. దానిని స్క్రీన్‌షాట్‌ తీసిన పీటర్సన్‌.. .. అనుష్క శర్మని కోహ్లీ బాస్‌గా పీటర్సన్ అభివర్ణించాడు. ఫిట్‌నెస్‌ మెరుగు పర్చుకునేందుకు 2018 నుంచి వెజిటేరియ‌న్ గా మారిపోయిన విష‌యం స‌హా..ఒత్తిడి వల్లే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఒక్కసారి కూడా విజేత‌గా నిల‌వ‌లేదంటూ కీల‌క విష‌యాలను ఇంటర్వ్యూ వెల్ల‌డించాడు కోహ్లీ.