‘షేర్ యూవర్ చీర్’ హ్యాష్ ట్యాగ్‌తో సరికొత్త క్యాంపెయిన్‌ను ఎయిర్‌టెల్ చేపట్టింది. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. 2011లో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అద్భుతం జరిగి సుమారు 12 ఏళ్లు గడుస్తోంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ టీమిండియా ప్లేయర్స్ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఎంతో మంది క్రికెట్ అభిమానులకు మర్చిపోని క్షణం అది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాలను అందుకొని దూసుకుపోతోంది. చివరిగా దక్షిణాఫ్రికాపై ఏకంగా 243 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించి టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. భారత క్రీడాకారుల ఆటతీరు చూస్తుంటే ఈసారి ప్రపంచకప్ భారత్ వశం కావడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
‘షేర్ యూవర్ చీర్’ హ్యాష్ ట్యాగ్‌తో సరికొత్త క్యాంపెయిన్‌ను ఎయిర్‌టెల్ చేపట్టింది. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. 2011లో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అద్భుతం జరిగి సుమారు 12 ఏళ్లు గడుస్తోంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ టీమిండియా ప్లేయర్స్ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఎంతో మంది క్రికెట్ అభిమానులకు మర్చిపోని క్షణం అది.
Those moments moved us to tears of joy, it’s time to relive them and come together to cheer for our team. It’s time for you to #ShareYourCheer!
— airtel India (@airtelindia) October 25, 2023
ఇక ప్రస్తుతం 2023లో ప్రపంచ కప్‌ను సొంతం చేసుకునే దిశగా భారత ప్లేయర్స్ అడుగులు వేస్తున్న తరుణంలో 2011 వరల్డ్ కప్ తాలుకూ అద్భుత క్షణాలను మళ్లీ గుర్తుచేసుకునేందుకు గాను ఎయిర్ టెల్ ‘షేర్ యువర్ చీర్’ పేరుతో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. 2011 ప్రపంచకప్‌లో భారత్ శ్రీలంకపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏప్రిల్ 2వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది.
It’s time to open the floodgates of our 2011 memories and remember how proud and loud we all were. But this year, there’s a new way for us all to come together to celebrate! #ShareYourCheer
— airtel India (@airtelindia) October 25, 2023
ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఆ నాటి మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకునేందుకు ఎయిర్ టెల్ ట్విట్టర్ వేదికగా ‘షేర్ యూవర్ చీర్’ ట్యాగ్‌లైన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా క్రికెట్ లవర్స్ 2011లో తాము పొందిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకునే అవకాశాన్ని ఎయిర్ అందిస్తోంది. షేర్ యూవర్ చీర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేయాలని పేర్కొంది.
ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో సోషల్ మీడియా పరిధి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ నేపథ్యంలో భారతదేశ స్ఫూర్తిని ఎయిర్ టెల్ 5జీ ప్లస్ ఏకం చేస్తోంది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న తరుణంలో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ హై స్పీడ్ ఇంటర్‌నెట్ సరికొత్త శకానికి నాంది పలికింది. ఎలాంటి బఫరింగ్ లేకుండా అల్ట్రా-హై-డెఫినిషన్ వీడియోలను స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ అధిక ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తోంది. భారతలోని యూజర్లు తమ మొబైల్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లను నిరంతరాయంగా వీక్షిస్తున్నారు.
షేర్ యువర్ చీర్ పేరుతో ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్‌తో క్రికెట్ లవర్స్ టీమిండియాను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఎయిర్‌టెల్ చెబుతోంది. క్రికెట్ లవర్స్ తమ అభిమాన ప్లేయర్స్‌కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయాలని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఈ ప్రపంచ కప్ సీజన్ సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తిని, తీవ్రమైన భావోద్వేగాలకు ఎయిర్‌టెల్ పెద్ద పీట వేస్తోంది. టీమిండియాకు మద్ధతు తెలుపుతూ షేర్ యువర్ చీర్‌లో భాగం కావాలని ఎయిర్‌టెల్ పిలుపునిచ్చింది. ఇందుకోసం ఈ లింక్ క్లిక్ చేసి మీ సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..