భలే ఉందిగా.! టాయ్ ట్రైన్‌లో అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు
బ్రిటిషర్లు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో సరైన రహదారులు లేనందున.. సిలిగుడిలోని రైల్వే ట్రాక్ మీదుగా టాయ్ ట్రైన్‌లో అమ్మవారిని ఊరేగిస్తూ డార్జిలింగ్‌కు తీసుకువెళ్లి నిమజ్జనం చేసేవారు. కానీ ప్రస్తుతం అన్ని రకాల రహదారులు, వాహన సదుపాయాలు ఉన్నప్పటికీ గతంలో తమ పూర్వీకులు పాటించిన ఆచారాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు.
దేవీశరన్నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గా మాత విగ్రహాలను రోడ్లుపై ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తుంటారు. కానీ పర్వత ప్రాంతమైన డార్జిలింగ్‌లోని ఒక గ్రామంలో మాత్రం విభిన్నంగా అమ్మవారిని టాయ్ ట్రైన్‌లో దాదాపు 12 కి.మీ ఊరేగిస్తూ తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారట. అనేక ఏళ్లుగా ఇక్కడి స్థానికులు ఈ విధంగా అమ్మవారిని రైలులో ఊరేగించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బ్రిటిషర్లు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో సరైన రహదారులు లేనందున.. సిలిగుడిలోని రైల్వే ట్రాక్ మీదుగా టాయ్ ట్రైన్‌లో అమ్మవారిని ఊరేగిస్తూ డార్జిలింగ్‌కు తీసుకువెళ్లి నిమజ్జనం చేసేవారు. కానీ ప్రస్తుతం అన్ని రకాల రహదారులు, వాహన సదుపాయాలు ఉన్నప్పటికీ గతంలో తమ పూర్వీకులు పాటించిన ఆచారాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. అమ్మవారిని టాయ్ ట్రైన్‌లో ఊరేగిస్తూ.. తీసుకువచ్చి డార్జిలింగ్‌లోని రంగ్‌బుల్ నదిలో నిమజ్జనం చేస్తున్నారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అధికారులు సైతం నిమజ్జనం సమయంలో ఇక్కడి వారికి సహకారాన్ని అందిస్తుంటారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..