Ayodhya: అయోధ్యలో ఘనంగా గర్భగృహ శంకుస్థాపన.. వేడుకలో పాల్గొన్న యూపీ సీఎం

అయోధ్య(Ayodhya) లోని రామమందిర గర్భగృహానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. గర్భగృహంలో..

Ayodhya: అయోధ్యలో ఘనంగా గర్భగృహ శంకుస్థాపన.. వేడుకలో పాల్గొన్న యూపీ సీఎం
Follow us

|

Updated on: Jun 01, 2022 | 11:07 AM

అయోధ్య(Ayodhya) లోని రామమందిర గర్భగృహానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. గర్భగృహంలో రాళ్లు ఉంచే వేడుకలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అన్నారు. 2020 ఫిబ్రవరిలో ప్రారంభించిన తీర్థ క్షేత్రం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5, 2020న రామజన్మభూమి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయాన్ని డిసెంబర్ 2023 నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దాదాపు 17,000 రాళ్లను ఆలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. 2023 నాటికి గర్భగృహం, 2024 చివరి నాటికి ఆలయ నిర్మాణం, 2025 నాటికి ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత, ఆలయ పట్టణం కాశీలాగా వికసిస్తుంది. మథుర, బృందావనం, వింధ్యవాసిని ధామ్, నైమిష్ ధామ్‌లు కూడా కాలక్రమంగా వేగంగా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు జరగలేదు. ప్రతి రోజూ కాశీ విశ్వనాథ ఆలయాన్ని లక్ష మంది భక్తులు సందర్శిస్తారు. భవిష్యత్ లో అయోధ్య కూడా కాశీ పట్టణం లాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా.

ఇవి కూడా చదవండి

         – యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి