గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Temples Open During Eclipse: గ్రహణ దోషాలు లేని ఆలయాలు సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లోనూ తెరిచే ఉంటాయి. ఆ ఆలయాల విషయానికొస్తే ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం, ఢిల్లీలోని కల్కాజీ ఆలయం, ఉత్తరాఖండ్ లోని కల్పేశ్వర్ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, గయలోని విష్ణుపాద ఆలయం, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం గ్రహణాల సమయంలోనూ తెరిచే ఉంటాయి. ఆయా ఆలయాల ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Srikalahasti Mahakal

Updated on: Feb 28, 2026 | 6:05 PM

సాధారణంగా, గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా కొన్ని దేవాలయాలు గ్రహణ సమయంలో కూడా తెరవబడతాయి. వీటికి గ్రహణ దోషాలు ఉండవు. అందుకే ఈ ఆలయాలు సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లోనూ తెరిచే ఉంటాయి. ఆ ఆలయాల విషయానికొస్తే ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం, ఢిల్లీలోని కల్కాజీ ఆలయం, ఉత్తరాఖండ్ లోని కల్పేశ్వర్ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం, గయలోని
విష్ణుపాద ఆలయం, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం గ్రహణాల సమయంలోనూ తెరిచే ఉంటాయి. ఆయా ఆలయాల ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాళహస్తి, అరుణాచలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి శివాలయం, తమిళనాడులోని అరుణాచల క్షేత్రం ముఖ్యమైన గ్రహణ కాలం తెరిచి ఉన్న ఆలయాల్లో ఉన్నాయి. ఈ ఆలయాల్లో శివలింగాలు స్వయంభువులుగా ఉన్నందున, ఈ దేవతల ఆధీనంలోనే నవగ్రహాల ఉంటాయి. పండితుల ప్రకారం, ఈ దేవాలయాల్లోని దైవిక శక్తి గ్రహణ ప్రభావం నుంచి రక్షిస్తుంది.

శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడు సూర్య, చంద్రులు, అగ్ని భట్టారడితో కలిసి నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ఏర్పరిచినట్లు పురాణాలు చెబుతాయి. అందువల్ల రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు ఇలా ఉన్నా భక్తులు భయపడవలసిన అవసరం లేదు. గ్రహణ సమయంలో కూడా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించబడతాయి.

మహాకాళేశ్వర ఆలయం – ఉజ్జయినీ, మహారాష్ట్ర

శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరవబడుతుంది. ఇక్కడ శివుడు స్వయంభు మహాకాళ రూపంలో విగ్రహంగా ఉన్నారు. పండితుల నమ్మకం ప్రకారం, గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై పడదు.

కల్కాజీ ఆలయం – ఢిల్లీ

ఢిల్లీలోని కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరవబడే ఆలయాల్లో ఒకటి. కల్కా దేవి గర్వించే దేవత అని నమ్మకం. భక్తులు గ్రహణ సమయంలో ప్రత్యేక పూజల కోసం ఆలయానికి వస్తారు, ఎందుకంటే గ్రహాలు, నక్షత్రాలు ఆమె ద్వారా కదులుతాయని విశ్వాసం.

కల్పేశ్వర్ ఆలయం – ఉత్తరాఖండ్

కల్పేశ్వర్ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరవబడుతుంది. ఈ ఆలయంలోని శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించినట్లు నమ్మకం. అందువల్ల భక్తులు యథావిధిగా దర్శనం పొందుతారు.

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం – కొట్టాయం, కేరళ

కొట్టాయంలోని తిరువరప్పులోని శ్రీకృష్ణ ఆలయం రోజుకు పదిసార్లు నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తారు. స్వామి ఆకలి ఎక్కువగా ఉండటంవల్ల, విగ్రహం సన్నబడుతుందని నమ్మకం. కాబట్టి, గ్రహణ సమయంలో కూడా ఆలయం మూసివేయకుండా నైవేద్యాలు సమర్పించబడతాయి.

విష్ణుపాద ఆలయం – గయ

గయలోని విష్ణుపాద ఆలయంలో, గ్రహణ సమయంలో పిండ ప్రధానాన్ని చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందువల్ల, గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తెరవబడుతుంది.

లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్, రాజస్థాన్

బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం కూడా గ్రహణ సమయంలో మూసివేయరు. ఒకప్పుడు ఆలయం మూసివేసి నైవేద్యం చేయకపోవడం వల్ల దేవుడు ఆకలిగా ఉన్నట్లు అర్చకులకు కలలో చెప్పడంతో.. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఆలయం తెరవబడే సంప్రదాయం కొనసాగుతుంది.

ఈ దేవాలయాల్లో భక్తులు గ్రహణ కాలంలో దర్శనం పొందితే రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు, ఇతర గ్రహ దోషాలు తొలగుతాయని నమ్మకం ఉంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us