ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్‌ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం

|

Nov 24, 2021 | 2:46 PM

ISIS Magazine: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్లపై పడింది. 'ఐసిస్' నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్ ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్..

ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్‌ పోస్టర్ వివాదం..  భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం
Bhagavan Shiva
Follow us on

ISIS Magazine: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్ఐఎస్’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్లపై పడింది. ‘ఐసిస్’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్ ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్ లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదు హిందూ దేవత విగ్రహాలను ధ్వసం చేయాలంటూ పిలుపునిచ్చింది. ISIS పోస్ట్ చేసిన శివుడి ఫోటో వైరల్‌గా మారింది IANS నివేదిక ప్రకారం.. ఈ విగ్రహం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర నగరంలోని బీచ్‌లో ఉన్న 123 అడుగుల ఎత్తైన ప్రసిద్ధ శివుడుగా తెలుస్తోంది. ఈ క్షేత్రం ప్రసిద్ధ శివ పుణ్యక్షేత్రం. ఐసిస్ తన మ్యాగ్ జైన్ పై శివుడి తల తీసేసి.. తమ జెండాను ఎరువేసిన ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో తీవ్ర వివాదమైంది. ఇది తీవ్రవాదుల దుశ్చర్య అంటూ ఐసీస్ పై భారతీయులు, హిందుత్వవాదులు మడిపడుతున్నారు.

ప్రముఖ విశ్లేషకులు అన్షుల్ సక్సేనా తన ట్విట్టర్ ఖాతాలో శివుడి చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్ ‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కవర్ పేజీగా శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం.. ఆ తల స్థానంలో ISIS జెండా ఉన్నట్లు ఆ ఫోటో ఉంది. అంతేకాదు మ్యాగజైన్ కవర్ మొదటి పేజీలో  “అబద్ధ దేవుళ్లను విచ్ఛిన్నం చేయడానికి ఇది సమయం”.అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్షుల్ మురుడేశ్వర పట్టణంలో భద్రతను పెంచాలని సక్సేనా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మురుడేశ్వర ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.  ముఖ్యంగా, మురుడేశ్వర తీర పట్టణం భత్కల్ పట్టణానికి చాలా సమీపంలో ఉంది. ఈ భత్కల్ పట్టణం భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణలో ఉంది. ఎందుకంటే ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఈ నగరానికి చెందినవాడు.

Also Read:

షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..