
Karthika Masam Festivals Telugu: శివకేశవుల భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తెలుగు పంచాంగం ప్రకారం ఎనిమిదో మాసమైన కార్తీకానికి సనాతన ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపారాధన, తులసీ పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు, దానధర్మాలతో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువు ఆరాధనకూ ఎంతో విశిష్టమైనది. 2026లో కార్తిక మాసం నవంబర్ 10, మంగళవారం ప్రారంభమై డిసెంబర్ 8, మంగళవారం అమావాస్యతో ముగియనుంది.
కార్తీక మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజూ దీపారాధన చేయడం, తులసీ పూజ, శివాభిషేకం, విష్ణు ఆరాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందుదాం.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పండుగలు, పుణ్య తిథులు, ఆధ్యాత్మిక విశేషాలు సంప్రదాయాలు, పంచాంగ వివరాలు, ధార్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతం, పంచాంగం, ఆచార సంప్రదాయాలను బట్టి తేదీలు లేదా పూజా విధానాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఇవి భక్తి, ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే.)