Lucky Dream: మీకు ఇలాంటి కలలు వస్తే డబ్బు వర్షంలా కురుస్తుంది..!!

| Edited By: Ravi Kiran

May 25, 2023 | 9:00 AM

కొంతమందికి రాత్రిపూట వచ్చే కలలు కొన్నిరోజుల పాటుగుర్తుంటుంది. మరికొంతమంది కలలు వచ్చినా..అవి గుర్తుండవు.

Lucky Dream: మీకు ఇలాంటి కలలు వస్తే డబ్బు వర్షంలా కురుస్తుంది..!!
Lucky Dream
Follow us on

కొంతమందికి రాత్రిపూట వచ్చే కలలు కొన్నిరోజుల పాటుగుర్తుంటుంది. మరికొంతమంది కలలు వచ్చినా..అవి గుర్తుండవు. నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అనేది సహజం అయితే కొన్ని కలలు అర్థాన్ని సముద్రిక్షాస్త్రంలో వివరంగా పేర్కొన్నారు. మనకు వచ్చే కొన్ని కలలు మనకు మంచి సూచనలను అందిస్తే, కొన్ని కలలు మనకు అశుభ సూచనలను ఇస్తాయి. కొన్ని కలలు మనకు భవిష్యత్తు గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చనిపోయినవారు మన కలలో కనిపిస్తే అదృష్టాన్ని సూచిస్తాయని చెప్పాలి. ఎలాంటి కలలు మన విధిని సూచిస్తాయో తెలుసుకుందాం.

ఉంగరం :

స్వప్నం శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి తన కలలో తన వేలికి బంగారు ఉంగరం తొడిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి త్వరలో అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందుతాడని సూచిస్తుంది. కలలో చకోర పక్షిని చూసే వ్యక్తి అదృష్టవంతుడు. ఈ పక్షి గురించి కలలు కనడం మీ అదృష్టాన్ని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

పచ్చని పొలాలు:

మీ కలలో పచ్చని పొలాన్ని చూడటం శుభ సంకేతం. ఈ కల మీకు త్వరలో మంచి సంకేతం వస్తుందని చెబుతుంది. అయితే, మీ కలలో బంజరు భూమిని చూడటం అరిష్టానికి సంకేతం.

శంఖ ధ్వని:

మీకు కలలో శంఖం కనిపిస్తే, మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుంది అని సూచిస్తుంది, ధనాగమనానికి ముందు ఈ కలలు వస్తే అది శుభసూచకం. అలాంటి కలలు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. కానీ, మనకు కలలో వినిపించే శంఖనాదం వినడానికి మధురంగా ​​ఉండాలి. అసహ్యకరమైన శంఖం ధ్వని మీ జీవితంలో ఇబ్బందులను తెస్తుంది.

సుమంగళి :

మీ కలలో సుమంగళి వంటి పదహారు అలంకారాలు కలిగి ఎరుపు రంగు చీర ధరించి ఉన్నట్లు కనిపిస్తే శుభప్రదంగా చెబుతారు. అలాంటి కల మీరు జీవితంలో త్వరలో ఆనందం, శ్రేయస్సును పొందుతారని సంకేతం.

చేపలు:

మీ కలలో చేపను చూసినట్లయితే, మీరు శుభవార్త అందుకోబోతున్నారని అర్థం. అంతే కాదు ఈ కలతో ఎక్కడి నుండైనా డబ్బు పొందవచ్చు. కలలో బంగారు చేపలు కనిపిస్తే ప్రేమ, గౌరవం లభిస్తాయని అర్థం. దీనితో పాటు, మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ప్రేమను చూపుతారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..